దారుణం.. కనిపించినోళ్లను కనిపించినట్టే పొడిచేశాడు..!

-

జపాన్ లో దారుణం చోటు చేసుకున్నది. ఓ ఉన్మాది స్కూల్ విద్యార్థినులపై దాడికి తెగబడ్డాడు. కనిపించినోళ్లను కనిపించినట్టే తన దగ్గర ఉన్న కత్తితో పొడిచేశాడు. టోక్యోలోని కవాసాకి ప్రాంతంలో నోబోరిటో బస్ స్టాప్ వద్ద ఈ దారుణం చోటు చేసుకున్నది.

man attacked school students in japan

రెండు చేతుల్లో కత్తులతో అక్కడికి వచ్చిన ఉన్మాది.. ఐ విల్ కిల్ యూ.. అంటూ స్కూల్ విద్యార్థినులపై కత్తితో దాడి చేశాడు. తర్వాత తన గొంతు తానే కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దాడిలో 16 మంది విద్యార్థులు గాయపడగా… ఇద్దరు మృతి చెందారు.

హంతకుడి వయసు 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే.. హంతకుడు.. స్కూల్ విద్యార్థినులపై ఎందుకు కత్తితో దాడికి తెగబడ్డాడు అనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు. ప్రపంచంలోనే అత్యంత తక్కువ క్రైమ్ రేట్ ఉండే జపాన్ లో దాడి జరగడంతో జపాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Read more RELATED
Recommended to you

Latest news