పదవి విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్ రూల్స్ పైనా కొన్ని సంస్కరణలు తీసుకురానున్నట్టు జగన్ తెలిపారు. రూల్స్ అంటూ పదవి విరమణ చేయబోయే ఉద్యోగులను వేధించకుండా అడ్డుకట్ట వేయడానికి ప్రణాళికలు చేస్తున్నట్టు జగన్ తెలిపారు.
ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే వైఎస్ జగన్ ఉద్యోగులకు తీపి కబురు అందించారు. అందరిలా కాకుండా.. పాలనతో తనదైన మార్క్ చూపించడం కోసం వైఎస్ జగన్ ఇప్పటినుంచే శ్రమిస్తున్నారు. అందుకే.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఏపీ అభివృద్ధిపై దృష్టి పెట్టారు.
రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించారు. వాళ్ల పనిగంటలు తగ్గించారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకే మాత్రమే పని గంటలని కాబోయే సీఎం స్పష్టం చేశారు. జగన్ నిర్ణయంతో ఉద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సచివాలయానికి వచ్చే ఫైల్స్ పై జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సచివాలయం పని విధానాన్ని సరళీకృతం చేయనున్నామని.. ఉద్యోగులపై సాయంత్రం ఆరు దాటితే పని భారం ఉండకూడదన్నారు. ప్రతి ఫైల్ కు నిర్దిష్ట గడుపును విధించి.. ఆ గడువులోగా క్లియర్ చేసేలా పరిపాలన సంస్కరణలు తీసుకొస్తామన్నారు. ఫైల్స్ ను నెలలకు నెలలు పెండింగ్ లో పెట్టేది లేదని జగన్ తెలిపారు.
ఇక.. పదవి విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్ రూల్స్ పైనా కొన్ని సంస్కరణలు తీసుకురానున్నట్టు జగన్ తెలిపారు. రూల్స్ అంటూ పదవి విరమణ చేయబోయే ఉద్యోగులను వేధించకుండా అడ్డుకట్ట వేయడానికి ప్రణాళికలు చేస్తున్నట్టు జగన్ తెలిపారు. ఇంకా ఉద్యోగులకు ఏం కావాలో… వాళ్ల సలహాలు, సూచనలు ఇవ్వాలని సీఎస్ ఆఫీస్ ను ఏర్పటు చేస్తున్నట్టు జగన్ స్పష్టం చేశారు.