వదినతో అక్రమ సంబంధం.. వద్దన్నా వినలేదు..చివరికి !

అక్రమ సంబంధం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. వరుసకు వదిన అయినా ఓ ఆంటీ తో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేట లో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… చిలకలూరిపేటకు చెందిన అంజనీ రాజ్ స్థానికంగా ఉన్న క్వారీలో మిషన్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు.

ఇతడికి రెండేళ్ల కింద వివాహం జరిగింది. భార్యతో కలిసి చిలుకలూరిపేటలోని సుభాని నగర్ లో నివాసం ఉంటూ ప్రతిరోజూ క్వారీలో విధులకు హాజరవుతుంటాడు అంజని రాజ్. కానీ గత మంగళవారం రాత్రి చిలకలూరిపేట వద్ద హత్యకు గురయ్యాడు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో అంజనీ రాజ హత్యకు అక్రమ సంబంధమే కారణమని తెలుస్తోంది.

ఆంజనేయరాజు గతంలో తనకు అన్నయ్య వరుస అయ్యే వ్యక్తి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంలో గతంలో బంధువుల మధ్య గొడవలు కూడా జరిగాయి. పెద్దలు సరిది చెప్పినా వినకుండా వదినతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు అంజనీ రాజ్. ఈ నేపథ్యంలోనే అతన్ని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. ఈ సంఘటన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.