దారుణం.. ఎస్క‌లేట‌ర్ మీద వెళ్తున్న మ‌హిళ‌ను కాలితో త‌న్నిన వ్య‌క్తి.. వీడియో..

అమెరికాలోని బ్రూక్లిన్‌లో దారుణ‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఎస్క‌లేట‌ర్ మీద వెళ్తున్న ఓ మ‌హిళ‌ను ఓ వ్య‌క్తి వెన‌క్కి తిరిగి కాలితో త‌న్నాడు. దీంతో ఆమె కింద‌కు ప‌డిపోయింది. సామాజిక మాధ్య‌మాల్లో ఈ సంఘ‌ట‌న‌కు చెందిన దృశ్యాలు వైర‌ల్ కాగా.. స‌ద‌రు నిందితుడి కోసం పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

 

అమెరికాలోని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ప‌రిధిలో ఉన్న బ్రూక్లిన్‌లోని అట్లాంటిక్ ఎవ్‌-బార్‌క్లేస్ సెంట‌ర్ స్టేష‌న్‌లో ఓ మ‌హిళ (32), ఓ వ్య‌క్తి ఎస్క‌లేట‌ర్ మీద వెళ్తున్నారు. వ్య‌క్తి మ‌హిళ క‌న్నా కొన్ని మెట్లు మీద ఉన్నాడు. అయితే స‌డెన్ గా అత‌ను వెన‌క్కి తిరిగి ఆ మ‌హిళ‌ను కాలితో త‌న్నాడు. దీంతో ఆమె ఎస్క‌లేట‌ర్ నుంచి కింద‌కు ప‌డిపోయింది.

అనుకోకుండా జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌తో స‌ద‌రు మ‌హిళ‌కు గాయాల‌య్యాయి. ఆమె వెన్నెముక‌, కాళ్లు, చేతుల‌కు గాయాలు కాగా.. ఆమెకు చికిత్స అందించేందుకు పోలీసులు య‌త్నించారు. కానీ స్వ‌ల్ప గాయాలు అయ్యాయ‌ని, త‌న‌కు చికిత్స అవ‌స‌రం లేద‌ని ఆమె చెప్పింది. అయితే పోలీసులు ఆ వ్య‌క్తి కోసం గాలిస్తున్నారు.

స‌ద‌రు సంఘ‌ట‌న‌కు చెందిన వీడియోను న్యూయార్క్ పోలీస్ డిపార్ట్ మెంట్ వారు త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. అందులో ఉన్న వ్య‌క్తి గురించి వివ‌రాలు తెల‌పాల్సిందిగా వారు కోరారు. అయితే వారిద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగింది ? అత‌ను ఆమెను కాలితో త‌న్నాల్సిన అవ‌సరం ఏమొచ్చింది ? అన్న వివ‌రాలు మాత్రం తెలియ‌రాలేదు.