ఐఎంఏ స్కాం.. బడా నేతలు, ప్రభుత్వ ఉద్యోగులకు రూ.1750 కోట్ల మేర మన్సూర్‌ఖాన్ లంచాలు ..

-

ఐఎంఏ స్కాంలో కేవలం మన్సూర్‌ఖాన్‌కు మాత్రమే కాకుండా కర్ణాటక రాష్ట్రంతోపాటు దేశంలోని పలువురు ప్రముఖ నేతలు, ప్రభుత్వ అధికారులకు కూడా సంబంధం ఉందని సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. అందుకు గాను ఆయా ప్రముఖులకు ఖాన్ రూ.1750 కోట్ల మేర లంచాలను ఇచ్చాడట.

కర్ణాటకలో ఐ మానెటరీ అడ్వయిజరీ (ఐఎంఏ) స్కాం ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ రాష్ట్రంతోపాటు పలు ఇతర ప్రాంతాల్లో ఉన్న దాదాపుగా 40వేల మంది ఇన్వెస్టర్లు ఆ కంపెనీలో దాదాపుగా రూ.1500 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు. అయితే వారికి ఆ కంపెనీ డబ్బులు చెల్లించడంలో విఫలమై చేతులెత్తేసింది. ఈ క్రమంలోనే ఆ కంపెనీ డైరెక్టర్ మహమ్మద్ మన్సూర్ ఖాన్ స్కాం బయట పడగానే అప్పట్లో దుబాయ్‌కు పారిపోయాడు. ఈ మధ్యనే అతన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) అధికారులు భారత్‌కు రప్పించారు. అయితే ఖాన్‌ను విచారించిన సిట్ అధికారులు సంచలన విషయాలను వెల్లడించారు.

ఐఎంఏ స్కాంలో కేవలం మన్సూర్‌ఖాన్‌కు మాత్రమే కాకుండా కర్ణాటక రాష్ట్రంతోపాటు దేశంలోని పలువురు ప్రముఖ నేతలు, ప్రభుత్వ అధికారులకు కూడా సంబంధం ఉందని సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. అందుకు గాను ఆయా ప్రముఖులకు ఖాన్ రూ.1750 కోట్ల మేర లంచాలను ఇచ్చాడట. తన కంపెనీ చేస్తున్న మోసాలను కప్పి పుచ్చేందుకే ఖాన్ ఆయా ప్రముఖులకు అంత పెద్ద మొత్తంలో లంచాలను ఇచ్చాడట. ఈ క్రమంలోనే ఖాన్ తాను వారికి ఇచ్చిన లంచాల వివరాలను కూడా తన కంప్యూటర్‌లో డిటెయిల్డ్‌గా భద్రపరిచాడని సమాచారం.

కాగా ఖాన్ తన కంపెనీ మోసాలను కప్పి పుచ్చేందుకు గాను పలువురు ఐపీఎస్ అధికారులకు రూ.1 కోటి నుంచి రూ.20 కోట్ల వరకు లంచాలు ఇచ్చాడట. అలాగే ఓ ప్రముఖ రాజకీయ నాయకుడికి రూ.400 కోట్ల భారీ మొత్తాన్ని ఖాన్ ఇచ్చాడట. దీంతోపాటు ఆ నేత వివాహానికి కూడా ఖాన్ నిధులు సమకూర్చాడట. అయితే ఆ తరువాత ఖాన్ ఆ మొత్తాన్ని అడగ్గా ఆ నేత కేవలం కొద్ది డబ్బును మాత్రమే ఇచ్చాడట. దీంతో ఖాన్ మిగిలిన మొత్తాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశాడట. అయితే తన కంపెనీ చేస్తున్న మోసాలను ఆ నేత పసిగట్టి ఖాన్ పట్ల, ఆయన కంపెనీపై దుష్ప్రచారం చేసేందుకు పూనుకునేసరికి తన బండారం బయట పడుతుందేమోనని భావించిన ఖాన్ గప్‌చిప్‌గా ఊరుకున్నాడట.

 Mansoor Khan given Rs 1750 crore as bribes ima scam

కాగా ఖాన్ నుంచి రూ.3.5 కోట్ల లంచం తీసుకున్నందుకు గాను సిట్ గతంలో బెంగళూరు నార్త్ ఏసీపీ ఎల్‌సీ నాగరాజ్‌ను అరెస్టు చేయగా.. డిప్యూటీ కమిషనర్ బీఎం విజయ్‌శంకర్‌ను కూడా రూ.1.50 కోట్లు లంచం తీసుకున్నందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మరోవైపు ఖాన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 ప్రకారం కేసు నమోదు చేసింది. దీంతో గత 10 రోజులుగా ఖాన్ కస్టడీలో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆగస్టు 1వ తేదీన ఖాన్‌కు ఆగస్టు 14వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఈడీ నిర్ణయం తీసుకుంది. అయితే ఖాన్‌ను మళ్లీ విచారించేందుకు సిట్ ఇప్పటికే వారెంట్ కూడా పొందింది. దీంతో సిట్ అధికారులు ఖాన్‌ను విచారించనున్నారు. అలాగే ఈడీ నుంచి ఖాన్ విచారణకు సంబంధించిన వివరాలను కూడా సిట్ బృందం సేకరించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news