హైదరాబాద్‌ లో దారుణం..ట్రాన్స్ జెండర్ తో పెళ్లి..సెక్స్‌ చేసిన తర్వాత !

బంజారాహిల్స్ లో ఓ ట్రాన్స్ జెండర్ ను ప్రేమ పేరుతో ఓ యువకుడు మోసం చేశాడు. ఇందిరా నగర్ లో నివసిస్తున్న ట్రాన్స్ జెండర్ రోజాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు బాబు అనే యువకుడు.అయితే.. వేరే అమ్మాయితో ఎంగేజ్ మెంట్ చేసుకొని రోజాను మోసం చేశాడు. దీంతో తనకు న్యాయం కావాలని ఆందోళనకు దిగింది బాధిత ట్రాన్స్ జెండర్ రోజా.

అటు రోజాకు బాసటగా పలువురు ట్రాన్స్ జెండర్ లు నిలిచారు. తనను రెండు సంవత్సరాలుగా బాబు అనే స్థానిక యువకుడు ప్రేమించాడని.. గత కొద్ది రోజులుగా ఇద్దరం కలిసే ఉన్నామని ఈ సందర్భంగా రోజా పేర్కొంది. ఏడాది క్రితం తనను ప్రేమించి బాబు పెళ్లి చేసుకున్నాడని.. బాబు అలియాస్ గోపి తనతో సహజీవనం చేశాడని.. ఇప్పుడు వేరే అమ్మాయితో ఎంగేజ్ మెంట్ చేసుకొని నన్ను మోసం చేశాడని ఆగ్రహించింది రోజా.

బాబు పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో తనను మోసం చేశాడని ఫిర్యాదు చేశానని.. బాబు మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందని తెలిపింది బాధితురాలు. బాబు కు వారి పేరెంట్స్ వేరే అమ్మాయితో ఎంగెంజ్ మెంట్ కమ్మంలో జరిపించారు… మా ట్రాన్స్ జెండర్ సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం వెళ్లి న్యాయ పోరాటం చేస్తానని వెల్లడించింది. దీనిపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.