ఇటీవల కాలంలో చిన్నచిన్న కారణాలతో తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు కొంతమంది. ముఖ్యంగా మహిళలు క్షణికావేశానికి గురై కట్టుకున్నవారిని, కన్నవాళ్లను వదిలిపెట్టి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే చూశాం. సంసారాల్లో చిన్నచిన్న సమస్యలను పెద్దవిగా చూస్తూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఓ పది నిమిషాలు స్థిమితంగా ఆలోచిస్తే పరిష్కారం అయ్యే వివాదాలను ప్రాణం మీదికి తెచ్చుకుంటున్నారు.
తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ జీడిమెట్లలో చోటు చేసుకుంది. భర్త తనని షాపింగ్ తీసుకెళ్ల లేదని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో జరిగింది. బోరబండకు చెందిన శిరీష(23) మెట్టుకాని గూడకు చెందిన వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. వారికి ఏడాదిన్నర పాప ఉంది. ఇదిలా ఉండగా శనివారం భర్తను షాపింగ్ కు తీసుకెళ్లాలని కోరగా.. భర్త నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి గురైన సదరు వివాహిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.