త్వరలోనే వైద్యశాఖలో 60 లక్షలు ఉద్యోగాలు భర్తీ : కేంద్ర ఆర్థిక శాఖ

-

త్వరలోనే వైద్య శాఖలో 60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి భగవత్ కిషన్ రావు కరాడ్ ప్రకటన చేశారు. ఇవాళ కేంద్ర ఆర్ధిక మంత్రి భగవత్ కిషన్ రావు కరాడ్ ఏపీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రూ. 19, 500 కోట్లు ప్రధాన మంత్రి గతి శక్తి కింద కేటాయించారని.. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు జాతీయ రహదారుల అభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు.

రైల్వే, పోర్ట్ లాజిస్టిక్స్ ఎయిర్ పోర్ట్ వంటి ఆరు అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారని… గతి శక్తి వల్ల పారిశ్రామిక అభివృధ్ధితో ఉద్యోగాలు పెరుగుతాయన్నారు. 400 వందే మాతరం రైళ్లు రానున్న 3 ఏళ్లలో నడుపుతామని.. కొండ ప్రాంతాల్లో పర్వత మాల స్కీంతో రోప్ వేస్ ఉంటుందన్నారు.

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని.. కోవిడ్ వల్ల ప్రాణాలతో పాటు ఆర్ధికంగా నష్టపోయామన్నారు. థర్డ్ వేవ్ వచ్చినా వ్యాక్సిన్ అందించడం వల్లే ప్రాణ నష్టం జరగలేదని.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. ఉత్సవాలు జరుగుతున్న తరుణంలో చాలా ప్రాధాన్యత గల బడ్జెట్ తెచ్చామని పేర్కొన్నారు. రైతులు, ఇతర అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారని.. ఎమ్మెఎస్ఎఈ స్కీం కింద రూ. 4.5 లక్షల కోట్లు కేటాయించారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news