వరంగల్: మానవత్వం మంటగలిసిన వేళ.. ఒకే కుటుంబంలో ముగ్గురి హత్య

వరంగల్ లో సామూహిక హత్య సంచలనంగా మారింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు హత్య కావింపబడ్డారు. ఐదుగురిపై కత్తులతో దాడి చేసారు. అందుఇలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వరంగల్ లోని ఎల్బీ నగర్ లో జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. ఆస్తుల తగాదా ముదిరి ముదిరి ప్రాణాలు తీసేంతగా మారింది. అన్నదమ్ముల మధ్య పశువుల వ్యాపారంలో జరిగిన గొడవలు హత్యల దాకా వెళ్ళాయి.

ఇక్కడ చనిపోయిన వారిలో చాంద్ పాషా(50), ఖలీల్ (40), సబీరా(42) ఉన్నారు. సమర్ (24), ఫహాద్ (26) గాయాలపాలై ఎంజీఎం ఆస్పత్రిలో విషమ పరిస్థితిలో ఉన్నారు. పాషా తమ్ముడు షఫీనే ఈ హత్యలకు కారణమని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం షఫీ పరారీలో ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు.