ప్రజా ప్రతినిధులు అంటే ఇలా నే ఉండాలని ముగ్గురు ప్రజా ప్రతినిధులు బుధ వారం రాత్రి నిరుపించారు. మూడు వేర్వేరు ప్రమాదాలలో ముగ్గురు వేర్వేరు ప్రజా ప్రతినిధులు ఆపద్భాంధువుల్లా.. క్షతగాత్రులను కాపాడారు. ముందుగా హకీం పేట్ వద్ద ద్వి చక్ర వాహానం పై వస్తున్న ఇద్దరు విద్యార్థులు అదపు తప్పి కిం పడి పోయారు. వీరు మియాపూర్ కు చెందిన వారు. అయితే ఇదే సమయంలో అటుగా వస్తున్న కేటీఆర్ తన కన్వాయ్ ని అపి ప్రమాదం లో గాయపడ్డ వారిని తన కన్వాయ్ ద్వారా ఆస్పత్రి కి తరలించారు.
అలాగే అబ్దుల్లాపూర్ మెట్ లో బైక్ వస్తున్న దంపతులు చిన్నారి ప్రమాదవ శాత్తు కిందపడి పోయారు. అదే మార్గం లో వస్తున్న కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తన కారులోనే గాయపడ్డ దంపతలును చిన్నారిని ఆస్పత్రి కి తరలించారు. అలాగే మల్కాపూర్ వద్ద ఆర్టీసీ బస్సు ఆటో రెండు ఢీ కొన్నాయి. ఆటో లో ఉన్న 5 గురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. అయితే అదే సమయంలో వికారాబాద్ వెళ్తున్న చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ప్రమాద స్థలం వద్ద తన కారును ఆపి అంబులెన్స్ లను రప్పించి గాయపడ్డా వారిని ఉస్మానియా ఆస్పత్రి కి తరలించాడు. కాగ ఇలా వివిధ ప్రమాధ ఘటనలలో ప్రజా ప్రతినిధులు స్పందించడం పట్ల సర్వత్ర ప్రశంసలు అందుతున్నాయి.