సీఎం అయ్యాక తొలిసారి కేసీఆర్ మహా ధర్నా..

-

దాన్యం కొనుగోలు అంశంపై గత 15 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం చెలరేగింది. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తు ధాన్యం కొనుగోలు చేయడం లేదని.. అధికార టీఆర్ఎస్ పార్టీ మండిపడుతోంది. అటు బిజెపి మాత్రం.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు అంటూ నిందలు వేస్తున్నారు.

kcr

ఈ నేపథ్యం లోనే కేంద్ర ప్రభుత్వం ఎండగట్టేందుకు టిఆర్ఎస్ పార్టీ.. మహాధర్నాకు పిలుపు ఇచ్చింది. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు టిఆర్ఎస్ నేతలు ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా లో పాల్గొన్నారు. అయితే ఈ మహా ధర్నా కు సీఎం కేసీఆర్ కూడా హాజరు కానున్నట్లు సమాచారం అందుతోంది. ధర్నా అనంతరం రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ తమిళ సై కి వినతిపత్రం ఇవ్వనున్నారు టిఆర్ఎస్ నాయకులు. అయితే సీఎం అయిన తర్వాత కెసిఆర్ మొదటిసారిగా ధర్నాలో పాల్గొనడం గమనార్హం. దీంతో  టిఆర్ఎస్  పార్టీ ధర్నాపై అంధరిలోనూ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news