విమానం రెక్కపై షూటింగ్.. కింద పడి ప్రాణాలు పోగొట్టుకున్న రాపర్

-

విమాన ప్రయాణమే డేంజర్. అటువంటిది విమానం రెక్కపై నిలబడి విన్యాసాలు చేయడమంటే ఇంకెంత డేంజర్. ఓ మ్యూజిక్ వీడియో కోసం విమానంపై సాహస విన్యాసాలు చేస్తూ విమానం రెక్కపై నుంచి జారిపడి ఓ రాపర్ మృతి చెందాడు. ఈ ఘటన బ్రిటీష్ కొలంబియాలో చోటు చేసుకున్నది.

33 ఏళ్ల రాపర్ జాన్ జేమ్స్ తన సొంత మ్యూజిక్ ఆల్బమ్ కోసమే ఈ విన్యాసం చేయబోయాడు. కెనడాకు చెందిన ఈ రాపర్ ఎప్పుడూ ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తుంటాడు. తన కొత్త ఆల్బమ్ కోసం విమానం రెక్కల మీద నిలబడి వీడియో షూట్ చేస్తుండగా విమానం ఒక్కసారిగా ఒరిగింది. దీంతో జేమ్స్ అదుపు తప్పి కింద పడిపోయాడు. ఆసమయంలో జేమ్స్ పారాచూట్ ఓపెన్ చేయలేకపోయాడని.. దీంతో కింద పడి అతడు మృతి చెందాడని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news