ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..డివైడర్ ఢీకొని ఆర్టీసీ బస్సు బోల్తా

 

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డివైడర్ ఢీకొని ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. కాకినాడ జిల్లా తుని జాతీయ రహదారిపై డివైడర్ ఢీకొని ఆర్టీసీ బస్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. గాయపడిన ప్రయాణికులను హుటాహుటిన తుని ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.

ఆర్టీసీ బస్సు విజయవాడ నుంచి పార్వతిపురం వెళ్ళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సు లో సుమారు 20 మంది ప్రయాణికులు . ఉన్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణికులు అందరూ సురక్షితంగానే ఉన్నారు. ఏవరికి ఎటువంటి ప్రాణప్రాయంలేదని డాక్టర్లు చెప్పుతున్నారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.