పోలీసు కస్టడీ నుంచి పరారైన సిద్దు హత్య కేసు నిందితుడు

-

మే 29 వ తేదీన సింగర్ సిద్దు మూసేవాల దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. పంజాబ్ లోని మాన్సా జిల్లాలోని మూసా గ్రామ సమీపంలో సిద్దు ని కాల్చి చంపడం కలకలం రేపింది. ఈ కేసులో పంజాబ్, ఢిల్లీ, ముంబై కి చెందిన పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. అయితే ఈ హత్య కేసు నిందితుడు గ్యాంగ్ స్టార్ దీపక్ అలియాస్ టినూ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. శనివారం రాత్రి పోలీసుల కస్టడీ నుంచి దీపక్ తప్పించుకొని పారిపోయినట్లు అధికారులు తెలిపారు.

సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ( సిఐఏ) సిబ్బంది ప్రైవేట్ వాహనంలో మాన్సా నుంచి కపూర్దాల జైలుకు రాత్రి తరలిస్తున్న క్రమంలో అతను తప్పించుకున్నాడని తెలిపారు. పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న దీపక్ ప్రధాన నిందితుడు లారెన్స్ బిష్ణోయ్ కి అత్యంత సన్నిహితుడు. సిద్దు హత్యకేసుకు పథకం రచించిన వారిలో దీపక్ పేరుని చేర్చారు పోలీసులు. గతంలో 2017లో అంబాల సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించాడు దీపక్. అప్పుడు కూడా పెప్పర్ స్ప్రే ఉపయోగించి పారిపోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news