సంగారెడ్డి జిల్లా జిన్నారం అడవుల్లో సాఫ్ట్ వేర్ హత్య..లవ్ ఎఫైరే కారణం !!

సంగారెడ్డి జిల్లా జిన్నారం అడివి ప్రాంతంలో ఓ సాఫ్ట్‌ వేర్‌ హత్య కలకలం రేపుతోంది. కూకట్ పల్లి లో మిస్సింగ్ కేసు నమోదు కాగా.. ఇవాళ హత్య జరిగిన విషయం బయట పడింది. అయితే.. ఈ సాఫ్ట్ వేర్ నారాయణ రెడ్డి హత్య కేసులో కొత్త కోణం ఒకటి బయట పడింది. పరువు హత్యగా భావిస్తున్న పోలీసులు.. ప్రేమ పెళ్లి వ్యవహారమే ఈ హత్యకు కారణమని ప్రాథమిక నిర్థారణకు వచ్చారు.

కె.పి.హెచ్.బి కాలనీ రోడ్ నెంబర్ 1లో ఫ్రెండ్ తో కలిసి నివసిస్తున్న నారాయణ రెడ్డి (25) అనే వ్యక్తి గత నెల 30వ తేదీన అదృశ్యం అయ్యారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు పోలీసులు. ఇక ఈ రోజు జిన్నారంలో హత్య చేసి తగులబెట్టిన స్థితిలో మృతదేహం లభ్యం అయింది.

ఇక సంవత్సరం క్రితం ఓ యువతిని ప్రేమించి పెళ్లాడాడు నారాయణ రెడ్డి. పెళ్ళి ఇష్టం లేని యువతి తల్లిదండ్రులు, యువతిని బలవంతంగా తీసుకుని వెళ్లి హౌస్ అరెస్ట్ చేశారు. నారాయణ రెడ్డి పై బెదిరింపులకు పాల్పడ్డాడు యువతి బంధువు శ్రీనివాస్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే.. యువతి తల్లిదండ్రులు బంధువులు హత్యకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.