భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఏదో జరగబోతుంది…?

-

భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఏదో జరగబోతుందా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. ఆర్టికల్ 370 రద్దు సహా, తాజాగా ఎన్నార్సి, పౌరసత్వ సవరణ చట్టం వివాదాస్పదంగా మారడం దీనిపై కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గే అవకాశ౦ లేకపోవడంతో ఉగ్రవాదులు రగిలిపోతున్నారు. ఆ చట్టాలు అమలు జరిగితే తమకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పాకిస్తాన్ గూడచారి సంస్థ ఐఎస్ఐ భావిస్తుంది. ఈ నేపధ్యంలోనే సరిహద్దుల నుంచి భారీగా ఉగ్రవాదులను భారత్ లోకి పంపించే కార్యక్రమం చేస్తుంది.

ఈ క్రమంలోనే సైనికులను కూడా పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తుంది. ఉగ్రవాదులనే కాకుండా కొందరు కోవర్టులను కూడా సైన్యం మీద దాడులు చేసే విధంగా ఐఎస్ఐ వ్యూహాలు రచిస్తుంది. తాజాగా సైనికులు తినే ఆహారంలో విషం కలిపే అవకాశం ఉందనే సమాచారం నిఘా వర్గాలకు అందింది. దీనితో భారత సైన్యం ఇప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ప్రతీ ఒక్క సైనికుడి మీద డేగ కన్ను వేసింది. సరిహద్దుల్లో పహారా కాసే జవాన్ల సెల్ ఫోన్ ల మీద నిఘా పెట్టడమే కాకుండా వారి సంబంధాల మీద ఆరా తీస్తుంది.

మంచు పడుతుంది కాబట్టి ఇప్పుడు చొరబాట్లు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. సరిహద్దుల్లో పాకిస్తాన్ ఏదో చర్యకు పూనుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇక జమ్మూ కాశ్మీర్ లో కొందరు నాయకుల మీద కూడా కన్నేసి ఉంచుతుంది. దేశంలో అన్ని రాష్ట్రాల హోం మంత్రులకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సమాచారం కూడా అందించినట్టు తెలుస్తుంది. అటు తీర ప్రాంతాల్లో కూడా భారీగా భద్రతను పెంచింది సైన్యం.

Read more RELATED
Recommended to you

Latest news