మరో మహిళతో అల్లుడు కామకేళి.. మామకు విషయం తెలిసి…

అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురును ఓ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తే.. ఆ వ్యక్తి మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఈ విషయం తెలిసిన మామ కోపంతో మరి కొందరితో కలిసి అల్లుడిని కడతేర్చాడు.. ఈ ఘటన కర్ణాట‌క రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న విష‌యంలో పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. క‌ర్ణాట‌క రాష్ట్రం గుబ్బి తాలుకా క‌రిశెట్టిహళ్లిలో చౌకెన‌హళ్లిలో మూడ్ల‌య్య (40) అనే వ్య‌క్తి నివసిస్తున్నాడు. ఆయ‌న ఆరు సంవ‌త్స‌రాల కింద‌ట జ‌య‌ణ్ణ కూతురును పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో మూడ్ల‌య్య కొంత కాలం నుంచి వేరే మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తున్నాడు. ఈ విష‌యం మామ‌కు తెలిసింది.

దీంతో వేరే మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధాన్ని ఆపివేయాల‌ని మామ కోరాడు. అయినప్పటికీ.. అల్లుడిలో మార్పు రాకపోవడంతో.. ఎన్నో సార్లు చెప్పి చూసినా అల్లుడు మార‌లేదు. దీంతో అల్లుడిని చంపేయాల‌ని నిర్ణ‌యించుకున్నా మామ.. గ‌త సోమ‌వారం మూడ్ల‌య్య అర్ధ‌రాత్రి స‌మ‌యంలో బైక్ పై ఇంటికి వ‌స్తున్న క్రమంలో మ‌ధ్య‌లోనే మామ‌, మ‌రి కొంత మంది బైక్ ను అడ్డ‌గించారు. మూడ్ల‌య్య‌ను తీవ్రంగా కొట్టి చంపేశారు.

ఈ విష‌యంలో పోలీసుల‌కు తెలియ‌డంతో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. కేసు న‌మోదు చేసుకొని విచార‌ణ చేయ‌డం ప్రారంభించారు. ఈ విచార‌ణ‌లో వారికి విస్తుపోయే నిజాలు తెలిశాయి. సొంత మామే ప‌లువురితో క‌లిసి అల్లుడిని హ‌త్య చేశాడ‌ని తెలుసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌ను ఛేదించారు. ఈ హ‌త్య‌లో ప్రమేయం ఉన్న జ‌య‌ణ్ణతో పాటు అత‌డి కుమారుడు, మ‌రో న‌లుగురు వ్య‌క్తులను పోలీసులు అరెస్టు చేశారు.