వేరే వ్యక్తితో అక్రమ సంబంధం..నవ వధువు అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌ లో దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ లోని రాజేంద్రనగర్ లో నవ వదువు అనుమానాస్పద మృతి చెందింది. ఇంట్లో ఫ్యాన్ కు వ్రేలాడుతూ కనిపించిన రేణమ్మ…మరణించింది. వివాహం జరిగి 5 నెలలకే తనువు చాలించింది రేణమ్మ. భర్త శ్రీను తో పాటు మరో ఇద్దరు కలిసి తమ ‌కూతురిని దారుణం హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు బాధితురాలి తల్లి దండ్రులు.

వేరే వ్యక్తి తో అక్రమ సంబంధం పెట్టుకుందంటూ రేణమ్మ పై పలు మార్లు దాడి చేశాడు భర్త శీను. పథకం ప్రకారం నిన్న రేణమ్మ ను హత్య చేసి ఫ్యాన్ కు ఉరి వేసి ఆత్మహత్య గా చిత్రీకరణ చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో భర్త శ్రీను ను అదుపులోకి తీసుకున్న పోలీసులు… మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. భర్త శ్రీను పై మర్డర్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. పోలీసులు భర్త శ్రీను కు వత్తాసు పలుకుతున్నారని పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.