సమాజానికి కొందరు చీడపురుగుల్లా మారుతున్నారు, ఎంత వయస్సు వచ్చినా వెకిలి చేష్టలు పోవడంలేదు.. నిజానికి మన చట్టాలు ఇలాంటి వారి విషయాల్లో చాలా కఠినంగా ఉంటే తప్పితే లోకంలో ఇలాంటి వెధవలు దారిలోకి రారు.. ఈ మాటలేంటి అసలు ఏం జరిగిందని ఉబలాటపడుతున్నారా.. ఈ ముచ్చట వింటే మానవత్వం ఉన్న ప్రతి వారు చలించక తప్పదు.. ఇక తమిళనాడులోని కన్యాకుమారిలో, తంగపట్టణానికి చెందిన ఓ కూలీ, మతిస్థిమితం లేని భార్య, ఎనిమిదేళ్ల కూతురుతో ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు.. అసలే పేదవాడు దానికి తోడు కరోనా అనే దరిద్రం వల్ల విధించిన లాక్‌డౌన్ కారణంగా పనుల్లేక పోవడంతో పూట గడవడం కష్టంగా మారింది.
ఈ క్రమంలో ఇంట్లోని పరిస్థితి గమనించిన చిన్నారి ఇంటింటికీ వెళ్లి ఆర్థిక సాయం చేయాలని అర్థిస్తున్న నేపధ్యంలో బాలిక నిస్సహాయతను అవకాశంగా మలచుకున్న కొందరు కామాంధులు వెకిలిచేష్టలతో ఆ పసిదానిపై ఎగబడ్డారట.. తాము చెప్పినట్లు చేస్తే డబ్బులిస్తామని ఆశపెట్టి ఆ బాలికతో ఒంటి మీది బట్టలన్ని విప్పించారట.. ఆ బాలికను అలా చూస్తూ ఆ కామపిశాచులు పైశాచికానందం పొందాయట. కాసేపటికి రూ.50 బాలికకు ఇచ్చి పంపగా ఇంటికెళ్లిన ఆ బాలికను తన తండ్రి డబ్బులు ఎక్కడివి అని అడగ్గా జరిగిన విషయం చెప్పడంతో అతను ఆ ఊరిపెద్దలను ఆశ్రయించాడు.
కాగా బాలికకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకున్న పెద్దలు చలించిపోయి సెల్‌ఫోన్‌లో ఆమె స్టేట్‌మెంట్ రికార్డు చేసిన అనంతరం దాన్ని పోలీసులకు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు చేరవేయడంతో రంగంలోకి దిగిన వారు ఈ కామాంధుల మదాన్ని అణచడానికి సిద్దమైనారట.. ఇకపోతే ఇంతటి నీచానికి దిగజారిన వారిలో ముహమ్మద్ నూగు(75), సహాయ దాసన్(52), జహీర్ హుస్సేన్(53), అబ్దుల్ జఫ్ఫార్(66), మరో ఇద్దరు మైనర్లు ఉన్నారట.. చూశార ముసలి వయస్సుకు వచ్చినాగానీ వీరి బుద్ది ఎలా ఉందో.. ఇలాంటి వెధవలు సమాజానికి అవసరమా చెప్పండి అంటున్నారట నెటిజన్స్..