రెండో భార్యకు రెండుసార్లు పాము విషం ఎక్కించిన భర్త.. సీన్‌ కట్‌ చేస్తే..

-

భార్యాభర్తల బంధం చాలా పవిత్రమైనది అని పురాణాల్లో చెప్తారు.. కానీ ఈరోజుల్లో ఏ బంధం దృఢంగా లేదు. ముఖ్యంగా భార్యభర్తల రిలేషన్‌ అయితే పదిలో నాలుగు జంటలు విడిపోతున్నాయి.. అక్రమసంబంధాలు, అనైతిక వ్యవహారాలు.. ఆస్తికోసమో, ప్రియుడికోసమో కట్టుకున్నవారిని కడతేరుస్తున్నారు. జీవితం మీదేనా.. వారిది కదా..? మొదటి భార్యతో సంబంధం సరిగ్గా లేదని రెండో వివాహం చేసుకున్నాడో భర్త.. ఆ తర్వాత మనసు మారింది.. మొదటి భార్యేకావాలనుకున్నాడు.. ఇప్పుడు రెండోభార్య అడ్డుగా ఉందని పాముతో కాటేయించాడు.
మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటన అక్కడి పోలీసులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. మాల్యా ఖేడీ గ్రామంలో నివసిస్తున్న మోజిమ్ ఆజ్మరీ అనే వ్యక్తి హలిమా బీ అనే మహిళను 2015వ సంవత్సరంలో రెండో వివాహం చేసుకున్నాడు. ఈ నెల 8న మోజిమ్‌ తన స్నేహితుడైన స్నేక్ క్యాచర్ రమేష్‌ మీనాతో కలిసి విషం చిమ్మే పామును ఇంటికి తీసుకెళ్లి కాటు వేయించాడు. అయితే పాము కాటుతో కొంచెం సేపు స్పృహ కోల్పోయి మళ్లీ యధావిధిగా ఆమె మేల్కొనడంతో ఆశ్చర్యపోయాడు
భార్యను తన చేతికి మట్టి అంటకుండా పాము కాటుతో లేదా పాము విషం ఎక్కించి చంపాలనుకున్న మోజిమ్ అజ్మిరా మరోసారి అదే ప్రయత్నం చేశాడు.. తన తమ్ముడు కాలా సహాయంతో డిసెంబర్‌ 9న మరోసారి హలీమా శరీరంపైకి విష సర్పాన్ని ఎక్కించాడు. రెండు సార్లు పాముకాటుతో కట్టుకున్న భార్యను చంపాలని చూశాడు మోజిమ్. అయితే రెండు సార్లు ప్లాన్ వర్కవుట్ కాలేదు. చివరకు విషపూరితమైన ఇంజక్షన్‌ ఇచ్చి పారిపోయాడు. విషయం తెలుసుకున్న హలిమా పేరెంట్స్ ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించారు. హలీమా బీని చంపాలనుకుంది ఆమె భర్త మోజిమ్ అజ్మీరా అని తేల్చారు. అయితే ఎందుకు చంపాలనుకున్నాడో పోలీసులు ఆరా తీశారు. మోజిమ్‌కు మొదట షాను బీ అనే మహిళతో పెళ్లి జరిగింది. అయితే ఓ స్మగ్లింగ్ కేసులో మోజిమ్ జైలుకు వెళ్లడంతో అతని భార్య ప్రియుడితో కలిసి ఇల్లు విడిచి వెళ్లింది. రెండేళ్ల జైలు శిక్ష అనుభవించిన మోజిమ్ రిలీజవగానే బాధితురాలు షాను బీని అనే మహిళను వివాహం చేసుకున్నాడు. రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన తర్వాత అంటే 2015లో మరో పెళ్లి చేసుకున్నాడు.
ఈవిషయం తెలిసి మొదటి భార్య మోజిమ్‌తో కాపురం చేయడానికి వచ్చింది. కిషాను బీతో కలిసి ఉండేందుకు రెండో భార్య హలిమా బీ అంగీకరించలేదు. అంతే ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు భర్త మోజిమ్. అందులో భాగంగానే పాము కాటుతో పైకి పంపించి మొదటి భార్యతో కాపురం చేద్దాం అనుకున్నాడు.. పోలీసులు గుర్తించి మోజిమ్ అతని తమ్ముడు కాలా, తల్లి, స్నేహితుడు కాలాను అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news