పదేళ్లలో ఏడుసార్లు భర్తను అరెస్ట్‌ చేయించిన భార్య.. మళ్లీ ఆమె అలా చేసేదట..!

-

భార్యభర్తల మధ్య తరచూ ఏదో ఒక గొడవ జరుగుతుంది. ఆ గొడవలు మరీ అంత పెద్దవి కాకముందే సెటిల్‌ అవ్వాలి. కానీ కొన్నిసార్లు గొడవలు పంచాయితీలు, పోలీస్‌ స్టేషన్‌ వరకూ వెళ్తాయి. అయితే ఇది చాలా తక్కువసార్లు మాత్రమే జరుగుతుంది. దాదాపు ఇంట్లో వాళ్లే సర్ది చెప్తారు. కానీ ఇక్కడ ఓ భార్య పదేళ్లలో తన భర్తను ఏడుసార్లు అరెస్ట్‌ చేయించింది. హైలెట్‌ ఏంటంటే.. అరెస్ట్‌ చేసిన ప్రతిసారి మళ్లీ ఆమె ష్యూరిటీ ఇచ్చి బెయిల్ మీద భర్తను విడిపిస్తుందట.! ఇంతకీ ఇది ఎక్కడ జరుగుతుందో చూద్దామా..!

ఈ విచిత్రమైన ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే గుజరాత్‌లోని మొహసానాలో ఓ మహిళ తన భర్తను గృహహింసకు పాల్పడినందుకు గానూ 2015లో తొలిసారిగా కేసు పెట్టి అరెస్టు చేయించింది. అలా పదేళ్లో ఏడుసార్లు అరెస్టు చేయించింది. అతను అరెస్టు అయిన తర్వాత మళ్లీ భార్యే హామీగా ఉండి బెయిల్‌ ఇచ్చి విడుదల చేయించేదట.

ఆ దంపతుల పేర్లు సోనూ, ప్రేమ్‌ చంద్‌. వారికి 2001లో వివాహం అయ్యింది. 2014 నుంచి వారి వైవాహిక బంధంలో ఇబ్బందులు మొదలయ్యాయి. సోను 2015లో తన భర్త భౌతిక దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ తొలిసారిగా కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఆమెకు నెలవారి భరణం కింద రూ. 2000 ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. రోజువారీ కూలీ అయిన ప్రేమ్‌చంద్‌, భరణం మొత్తాన్ని చెల్లించడానికి కష్టపడటంతో అతనిని అరెస్టు చేశారు. దీంతో ప్రేమ్‌చంద్‌ ఐదు నెలలు జైల్లో ఉన్నాడు. మళ్లీ అతడి భార్య సోనూనే అతనికి విడుదలయ్యేల బెయిల్‌ ఏర్పాటు చేసేది. మళ్లీ భార్యభర్తలిద్దరూ కలిసిపోయేవారు

చట్టబద్ధంగా..చూస్తే వేరువేరుగా ఉండాలి అయినప్పటికీ ఇద్దరూ కలిసే జీవించేవారు. మళ్లీ కొద్దిరోజులకే గొడవపడటం మళ్లీ పోలీసు మెట్లక్కెడం. ఇలా జరగుతూనే ఉండేది. అయితే ఈ సారి ప్రేమ్‌చంద్‌ ఈ ఏడాది ప్రారంభంలో కూడా భరణం చెల్లించడంలో విఫలంకావడంతో అరెస్టు అయ్యాడు. మళ్లీ భార్య సోనూనే విడుదల చేయించింది.

అయితే ఈసారి.. తన భార్య సోనూ, ఆమె కొడుకు తనపై దాడి చేశారంటూ అతడే కేసు పెట్టాడు. తన వాలెట్‌, సెల్‌ఫోన్‌ కనిపించటం లేదని అడిగినందుకు తనపై దాడి చేశారని వాపోయాడు. ఈ కేసు పోలీసులకు కూడా ఓ తలనొప్పిలా మారింది. ఇక్కడ విచిత్రమేమిటంటే ప్రతిసారి భార్య కేసులు పెడుతండగా..ఈసారి ప్రేమ్‌చందే తన భార్య, ఆమె కొడుకుపై కేసు పెట్టడంతో పోలీసులు షాక్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news