తరచూ ఫోన్ మాట్లాడొద్దు అన్న తండ్రి.. కూతురు ఏం చేసిందంటే..?

-

ప్రస్తుత రోజుల్లో ఎవరు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో తెలియడం లేదు. ఆత్మహత్య అనేది నేటి యువతకు ఫ్యాషన్​ గా మారిపోయింది. తల్లి దండ్రులు మందలించారని కొందరు, పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయని కొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. తమను ఇన్నేళ్లు కష్టపడి పెంచిన తల్లిదండ్రులు ఏమైపోతారని కనీసం ఆలోచించకుండా వారు అనవసరంగా జీవి తీసుకుంటున్నారు. ఇన్ని రోజులు వారే సర్వస్వమనుకుని బతికిన తల్లిదండ్రులు ఒక్కసారిగా అనాథలుగా మారిపోతున్నారు.

అసలు ఆత్మహత్య చేసుకునేందుకు ఉన్న తెగువలో 50 శాతం బతికేందుకు చూపిస్తే.. ప్రపంచంలో చాలా గొప్ప వాళ్లుగా ఎదుగుతారని చాలా మంది నిపుణులు చెబుతున్నారు. ఆత్మహత్య అనేది నేరమైనప్పటికీ అనేక మంది ఆత్మహత్యల బాట పట్టడం విచారకరం.

ఇకపోతే ప్రస్తుతం మీర్​ పేట పోలీస్​ స్టేషన్​ పరిధిలోని బడంగ్​ పేట లక్ష్మీవిహార్​ కాలనీలో చోటు చేసుకున్న ఘటన బాధాకరంగా ఉంది. అంతే కాకుండా ఇంత చిన్న రీజన్లకు కూడా ఆత్మహత్య చేసుకుంటారా అని అంతా అనుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే… చంద్రవిహార్​ కాలనీకి చెందిన లక్ష్మయ్య అనే వ్యక్తికి ఒక కుమార్తె ప్రశాంతి ఉంది. ఆమె ప్రస్తుతం డిగ్రీ సెకండియర్​ చదువుతోంది. కాగా ఆ యువతిని ఫోన్​ లో ఎక్కువ సేపు మాట్లడవద్దని లక్ష్మయ్య మందలించడంతో మనస్థాపం చెంది జీవి తీసుకుంది.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్​ కు తన చున్నీతోనే ఉరేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం సదరు యువతి డెడ్​ బాడీని ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news