రాహుల్ గాంధీలో వినూత్న శైలి.. ఢిల్లీ వీధుల్లో చక్కెర్లు

-

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీలోని వినూత్న శైలి ఇవాళ బయటపడింది. దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగిన విషయం తెలిసింది. ఈ ధరలను నిరసిస్తూ ఆయన పార్లమెంట్‌కు సైకిల్‌పై వెళ్లారు. ఎప్పుడూ ఖరీదైన కార్లలో తిరిగే రాహుల్ గాంధీ.. ఢిల్లీ వీధుల్లో సైకిల్‌పై చక్కెర్లు కొట్టడంతో చూసిన ప్రతిఒక్కరూ ఆశ్చర్యపోయారు. రాహుల్ వెంట పలువురు విపక్ష నేతలు కూడా సైకిల్ ఎక్కి నిరసన తెలిపారు.

గతంలో తమిళనాడు ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ వినూత్నంగా వ్యవహరించి ఓటర్లను ఆకర్షించారు. సాధారణ టీకొట్టులో టీ తాగి, స్థానిక వ్యక్తులతో కలిసి సహపంక్తి భోజనం చేసి అందర్నీ ఆశ్చర్యపర్చారు. సముద్రంలో ఒంటరిగా దూకి ఈత కొట్టడం, పార్లమెంట్‌లో మోదీని హత్తుకోవడం వంటివి చేసి రాహుల్ గాంధీలో ఉన్న విలక్షణాన్ని దేశానికి చూపించారు.

 

ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలకు సైకిల్‌పై వెళ్లి దేశం చూపును తమ వైపు తిప్పుకున్నారు. అంతకుముందు రాహుల్ పార్లమెంటు విపక్ష పార్టీల లోక్‌సభ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లతో బ్రేక్ ఫాస్ట్ మీట్ నిర్వహించారు. కాంగ్రెస్‌తో పాటు, ఎన్‌సీపీ, శివసేన, ఆర్జేడీ, ఎస్‌పీ, సీపీఎం, సీపీఐ, ఐయూఎంఎల్, రివల్యూషనరీ పార్టీ (ఆర్ఎస్‌పీ), కేరళ కాంగ్రెస్, జార్ఖాండ్ ముక్తి మోర్చా, నేషనల్ కాన్ఫరెన్స్, టీఎంసీ, లోక్‌తాంత్రిక్ జనతాదళ్ (ఎల్‌జేడీ) నేతలు ఈ బ్రేక్‌ఫాస్ట్ మీట్‌లో పాల్గొన్నారు.

 

పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్షాలన్నీ ఐక్యశక్తిగా నిలవాలని, ప్రజావాణిని బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ అణదదొక్కకుండా సంఘటితం కావాలని విపక్ష నేతలను కోరారు. అనంతరం రాహుల్ గాంధీ సైకిల్ తొక్కుకుంటూ పార్లమెంటుకు వెళ్లారు.

Read more RELATED
Recommended to you

Latest news