స్మార్ట్ ఫోన్లు వచ్చాక సూసైడ్ ను కూడా చిత్రీకరిస్తున్నారు కొంతమంది. తాము చనిపోతూ.. ఎందుకు చనిపోవాల్సి వస్తుందో తాము చనిపోయిన తర్వాత ఈ ప్రపంచానికి తెలియజేయడానికి వాళ్లకు స్మార్ట్ ఫోన్లు సరిగ్గా ఉపయోగపడుతున్నాయి. ఇలాంటి ఘటనే ఒకటి తమిళనాడులో చోటు చేసుకున్నది.
రామనాథపూరానికి చెందిన ట్రాన్స్ జెండర్ నస్రియా.. వయసు 23. ఎస్ఆర్పీ డిపార్ట్ మెంట్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నది. అయితే.. తన డిపార్డ్ మెంట్ కు చెందిన ఉన్నతాధికారులు తనను వేధిస్తున్నారట. తను ట్రాన్స్ జెండర్ కావడంతో ఎప్పుడూ తిడుతుండటంతో నస్రియాకు జీవితంపై విరక్తి పుట్టింది. దీంతో చనిపోవాలనుకుంది.
అందుకే.. సెల్ ఫోన్ లో వీడియో కెమెరా ఆన్ చేసి తను చనిపోవాలనుకుంటున్నట్టు చెప్పి.. తన చావుకు కారణం ఎవరో చెప్పి.. నీళ్లలో ఎలుకల మందు కలుపుకొని తాగింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగు పడినట్టు డాక్టర్లు తెలిపారు.