వివాహేతర సంబంధాలన్నీ చివరకు మరణాలకే దారి తీస్తాయని మరో సంఘటనలో రుజువు అయింది. భర్త లేదా భార్య ఇద్దరిలో ఎవరో ఒకరు అడ్డదారి పడదారు. దీంతో వారి బంధం ముగుస్తుంది. అది ఎవరో ఒకరి చావుకు కారణమవుతుంది. ఇలాంటి ఘటనలను మనం గతంలో చూశాం. ఇప్పుడు కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
మధ్యప్రదేశ్‌లోని హర్దా అనే జిల్లాలో ఉన్న ఖెదిపూర్ అనే ప్రాంతంలో అమీర్, తబస్సుమ్ దంపతులు జీవిస్తున్నారు. కాగా అమీర్ మొన్నటి వరకు మహారాష్ట్రలో పనిచేశాడు. కానీ లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా పని లేకపోవడంతో తిరిగి అతను స్వగ్రామానికి వచ్చాడు. అయితే అతను లేని సమయంలో తబస్సుమ్ ఇంకో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. ఇర్ఫాన్ అనే వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. కానీ అమీర్ తిరిగి రాగానే వారు కలిసేందుకు వీలు కాలేదు. దీంతో వారు ఎలాగైనా సరే అమీర్‌ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించారు.
ఈ క్రమంలోనే తబస్సుమ్ తన భర్తను ఎలా చంపాలా ? అని తీవ్రంగా ఆలోచించింది. అందుకు గూగుల్‌లో కూడా వెదికింది. కాళ్లు, చేతులను ఎలా కట్టాలి, ఎలా చంపాలి, చంపాక మృతదేహాన్ని ఎలా వదిలించుకోవాలి ? అన్న విషయాలను గూగుల్‌లో సెర్చ్ చేసింది. చివరకు ఆమె ఇర్ఫాన్‌తో కలిసి పథకం పన్నింది.
అందులో భాగంగానే ఆమె ఒక రోజు అమీర్‌కు అతను వాడే ఆస్తమా మెడిసిన్ కాకుండా స్పృహ కోల్పోయే మెడిసిన్ ఇచ్చింది. దీంతో అతను స్పృహ తప్పాడు. ఈ క్రమంలో ఇర్ఫాన్ వచ్చి అమీర్ కాళ్లు, చేతులను తాడుతో కట్టేశాడు. అనంతరం అమీర్ తలపై పెద్దపాటి సుత్తితో మోదుతూ చంపేశాడు. అయితే పోలీసులు మొదటగా ఆ క్రైమ్ సీన్ చూసి ఎవరో దొంగతనం కోసం ఇలా చేసి ఉంటారని అనుమానించారు. కానీ అమీర్ భార్య తబస్సుమ్ మీద వారికి అనుమానం వచ్చింది. దీంతో ఆమె కాల్ రికార్డ్స్‌ను వారు పరిశీలించారు. ఆమె తరచూ ఇర్ఫాన్‌కు పోన్ చేసినట్లు నిర్దారించారు. అలాగే ఆమె ఫోన్‌లో గూగుల్ సెర్చ్ హిస్టరీని పరిశీలించారు. దీంతో బండారం బయట పడింది. ఆమెను, హత్య చేసిన ఇర్ఫాన్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.