జగన్ సర్కార్ తీసుకుంటున్న చర్యల కారణంగా… ఆంధ్ర ప్రదేశ్ లో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుతున్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2620 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,50,288 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 44 చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 12,363 కి చేరింది. ఏపీలో గడిచిన 24 గంటల్లో 7504 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 58,140 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.
ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 17,79,785 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే ఏపీలో 55,002 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2,12,05,849 కరోనా పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కాగా ఇవాళ్టి నుంచి ఏపీలో కర్ఫ్యూ సడలింపు వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు వర్తించనున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు కానుంది. ఈ నెల 30వ తేదీ వరకు మారిన సడలింపు నిబంధనలు అమలు కానున్నాయి.