తల్లిదండ్రులు బాధపడతారని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన ఏపీలోని విజయనగరంలో చోటు చేసుకున్నది. తన తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేక.. ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పలేక… యువతి తనువు చాలించుకుంది. విజయనగరంలోని మెంటాడ మండలం బడేవలస గ్రామానికి చెందిన 19 ఏళ్ల నిర్మల తన ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది.
తల్లిదండ్రులకు పెళ్లి ఇష్టం లేదని చెబితే.. వాళ్లు ఎక్కడ బాధపడతారేమో అని… బంధువుల ముందు తల్లిదండ్రుల పరువు పోతుందని భావించిన నిర్మల ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది.