ఫ్రెండ్స్​తో ఛాలెంజ్ చేసి బాలికపై యువకుడి రేప్

-

సాధారణంగా స్నేహితులకు బెట్/ఛాలెంజ్ విసురుతాం. దాన్ని మరీ సీరియస్​గా తీసుకోకుండా ఓ పరిధి వరకు ట్రై చేస్తాం. కానీ ఝార్ఖండ్​లోని ధన్​బాద్​లో మాత్రం ఓ యువకుడు తన స్నేహితులతో దారుణమైన ఛాలెంజ్​ చేశాడు. అతడి ఛాలెంజ్ వల్ల ఓ బాలిక జీవితం నాశనమైపోయింది. ఇంతకీ ఆ ఛాలెంజ్ ఏంటంటే..?

ధన్​బాద్​కు చెందిన యువకుల మధ్య ఓ మైనర్ బాలిక విషయమై గొడవ జరిగింది. బాలిక తనను ప్రేమిస్తోందంటే.. తననే ప్రేమిస్తోందని ఇద్దరు యువకులు వాగ్వాదానికి దిగారు. అందులో సంజయ్ అనే వ్యక్తి.. ఆ బాలిక తననే ప్రేమిస్తుందని నిరూపిస్తానని స్నేహితులకు ఛాలెంజ్ చేశాడు. దానికి ప్రూఫ్​లు కూడా చూపిస్తానని చెబుతాడు.

ఫ్రెండ్స్​తో ఛాలెంజ్ చేసిన సంజయ్ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి తనతో పొదల్లోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని మొబైల్​లో రికార్డు చేశాడు. బాలిక తననే ప్రేమిస్తోందనడానికి ఇదే రుజువు అని ఆ వీడియోను తన స్నేహితులకు పంపించాడు. సంజయ్ స్నేహితులు ఆ వీడియోను బాలిక బంధువులకు చూపించారు. దీంతో బంధువులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు సంజయ్​ను అరెస్టు చేసి జైలుకు పంపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version