ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కింగ్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ పై విమర్శలొస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై గంభీర్ స్పందించారు. ‘ఒక్కో ప్లేయర్ ఒక్కోలా ఆడతాడు. మ్యాక్స్వెల్ చేయగలిగింది కోహ్లి చేయలేడు. కోహ్లి చేసేది మ్యాక్స్వెల్ చేయలేడు అని అన్నారు. ఏ టీమ్ లోనైనా విభిన్న ఆటగాళ్లుండాలి. అందరూ ఎక్స్ప్లోజివ్ బ్యాటర్లే ఉంటే స్కోర్ 300 చేయొచ్చు లేదా 30కే ఆలౌటవ్వొచ్చు అని అభిప్రాయం వ్యక్తం చేశారు.. జట్టు ఓడినప్పుడే విమర్శలొస్తాయి. గెలిస్తే ఎవరూ ఏమనరు’ అని అన్నారు.
కాగా, విరాట్ కోహ్లి సన్ రైజర్స్ హైదరాబాద్ పై స్లో ఇన్నింగ్స్ ఆడారని, 43 బంతులు ఆడి 51 పరుగులే చేశారని నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. పవర్ ప్లే తర్వాత 25 బంతులాడి 19 పరుగులు చేశారని, స్ట్రైక్ రేట్ 118 మాత్రమే ఉందంటున్నారు. ఈ సీజన్లో మిడిల్ ఓవర్లలో విరాట్ స్ట్రైక్ రేటు 123గా ఉందని, వేగంగా పరుగులు చేస్తే బాగుంటుందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.