జమ్మూకశ్మీర్: మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. సరిహద్దు నియమాలను ఉల్లంఘిస్తూ దాడి ప్రవర్తిస్తున్నారు. కొన్ని రోజులుగా భారత్‌లోకి చొరబడి ఉగ్రకార్యకలాపాలు సాగిస్తున్నారు. రెండు రోజుల క్రితం జమ్మూకశ్మీర్ ఎయిర్ పోర్టుపై డ్రోన్ దాడికి పాల్పడ్డారు. తాజాగా శ్రీనగర్ మల్హురా పరిమ్ పొరా గ్రామంలోకి చొరబడ్డారు. దీంతో అలెర్ట్ అయిన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. మృతుల్లో లష్కరే తోయిబా కమాండర్ అబ్రార్‌ను ఉన్నట్లు బలగాలు తెలిపాయి.
ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయి. ఉగ్రవాదులు దాగి ఉన్నారని వచ్చిన సమాచారంతో ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తెల్లవారు జామున ఉగ్రవాదులు తరసపడటంతో భద్రత బలగాలు కాల్పులు జరిపారు. ఘటనా స్థలంలో రెండు ఏకే-47 రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బలగాలు భారీగా మోహరించారు. ఇక ఈ ఘటనతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడిపోతున్నారు.