విజయవాడలోని దుర్గగుడిలో వెండి రథం ప్రతిమల చోరీకి గురైన రథాన్ని ఫోరెన్సిక్ బృందం పరిశీలించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రధం నుండి వేలిముద్రలను సేకరించారు. కీలక కేసు కావడంతో ఫోరెన్సిక్ డైరెక్టర్ ఆర్.కే శారీన్ నేరుగా వచ్చి పరిశీలించారు. సుమారు గంట పాటు ఆయన రధాన్ని పరశీలించారు. ఈ ఘటన ఎప్పుడు జరిగింది? దేని సహాయంతో ప్రతిమలు చోరీ చేశారనే అంశాలపై ఫోరెనిక్స్ బృందం నివేదిక ఇవ్వనుంది.
అయితే ఈ మూడు సింహాల అదృశ్యం కేసులో ఫోరెన్సిక్ రిపోర్ట్ కీలకం కానున్నది. చోరీ ఎప్పుడు జరిగింది అనేదానిపై పోలీసులు ఓ నిర్ధారణ రావటానికి ఫోరెన్సిక్ రిపోర్ట్ కీలకం కానుంది. సింహాల రేకులపై ఉన్న రజను, ఇతర ఆధారాలు లభ్యమయ్యాయని తెలుస్తోంది. లాక్ డౌన్ సమయం లేదా దుర్గమ్మ ఆలయం తెరిచిన తర్వాత జూన్, జులై మాసాల్లో చోరీకి గురయ్యాయా అన్న విషయం రిపోర్ట్ ద్వారా స్పష్టం కానుందని చెబుతున్నారు.