అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలో వడ్రవన్నూరు రహదారిపై కరెన్సీ వర్షం కురిసింది. జాతీయ రహదారిపై స్థానికులకు భారీగా నగదు దొరికింది. రూ.10 లక్షల రూపాయల మేర రూ.500 నోట్లు స్థానికులు లభించాయని తెలుస్తోంది. వడ్రవన్నూరు శివారులో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఈ కరెన్సీ పడేసినట్లు చెబుతున్నారు.
మ్మకపల్లి, 74 ఉడేగోళం గ్రామానికి చెందిన వారికి సమాచారం అందడంతో ఆయా గ్రామాల ప్రజలు వచ్చి నోట్లు ఏరుకున్నట్లు సమాచారం. అయితే ఈ నోట్ల కట్టల ఘటనపై రాయదుర్గం పోలీసులు రహస్యంగా తీస్తున్నట్టు చెబుతున్నారు. ఇక పోలీసులు బొమ్మక్కపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులను ఈ విషయంగా అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అయితే ఇవి దొంగ నోట్లా, లేదా ఏదయినా అవినీతి సొమ్మును ఇలా రోడ్డు మీద చల్లారా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.