వారిని ఆదుకోండి.. సీఎం జగన్ ను కోరిన సోము వీర్రాజు..!

-

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం సొంత భూములను త్యాగం చేసిన అమరావతి రైతుల పట్ల ప్రభుత్వం తీరుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం భూమి ఇచ్చిన ప్రతి రైతుకీ సకాలంలో వార్షిక కౌలు చెల్లించాలని. రైతులకు ఎకరాకీ ప్రతి  ఏటా రూ.3 వేలు మెట్టకీ, రూ.5 వేలు పెంచాల్సి ఉంది. కరోనా కష్ట సమయంలో సకాలంలో కౌలు చెల్లించి రైతులు ఆదుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి జగన్ ని ఆయన కోరారు కోరారు.

అలాగే 28వేల మందికి పైగా రైతులు తమ భూములను రాజధాని కోసం ఇచ్చారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఒప్పందం ప్రకారం ఇచ్చిన సమయానికి మించి 100 రోజులు గడిచాయని.. అందువల్లే రైతులు రొడెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలియజేశారు. అలాగే న్యాయం కోసం వచ్చిన వారిపై నమోదు చేసిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని.. వెంటనే వార్షిక కౌలు చెల్లించాలని సోము వీర్రాజు ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news