తెలంగాణలో త్వరలో కరెంట్ ఛార్జీలు పెంపు…!

-

తెలంగాణ ప్రభుత్వం మరో వడ్డింపులకు సిద్దం అవుతుందా..? అంటే జౌననే మాటే వినిపిస్తుంది. ఇటీవల ఆర్టీసీ బస్సు ఛార్జీలు తెలంగాణ ప్రభుత్వం పెంచేందుకు సిద్ధమవుతోంది. దీనికి అనుగుణంగా ఆర్టీసీ సంస్థ కూడా ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం ముందు ఉంచింది. దీనిని ప్రభుత్వం ఓకే చెప్పడమే మిగిలింది. మరో వైపు కరెంట్ ఛార్జీలు కూడా పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కరెంట్ సంస్థలు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈసారి కరెంట్ ఛార్జీలు భారీగానే పెంచే అవకాశం ఉంది. ఒక్కో యూనిట్ కు సగటున రూపాయి పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత, వచ్చే ఏడాది కలిపి రూ.21,552 కోట్ల మేర ఆర్థిక లోటు ఉంది. అయితే ఈసారి యూనిట్ కు రూ. 5,10 పైసలు పెంచితే కుదరదని.. రూపాయి వరకు పెంచాలని డిస్కంలు భావిస్తున్నాయి. ఇలా పెంచినా..రూ. 6928 కోట్ల మేర లోటు ఉంటుందని డిస్కంలు అంచానా వేస్తున్నాయి. కనీసం రూపాయి పెంచేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news