BREAKING : చెన్నై, తిరుచి ఎయిర్ పోర్ట్ ల్లో ఇద్దరు విదేశీయులకు కరోనా

-

దక్షిణాఫ్రికా దేశంలో పురుడు పోసుకున్న… ఒమీక్రాన్ వేరియంట్… ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కొత్త వేరియంట్ 25 దేశాలకు వ్యాప్తి చెందిందని నిపుణులు చెబుతున్నారు. ఈ తరుణంలో తమిళనాడు లోని చెన్నై, తిరుచి ఎయిర్ పోర్ట్ లో కరోనా కలకలం సృష్టించింది. ఈ రెండు ఎయిర్పోర్టు లలో విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా సోకింది. దీంతో ఇద్దరు విదేశీ ప్రయాణికులకు… ఒమీ క్రాన్ పరీక్షలు నిర్వహించారు అధికారులు.

రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వాటి వివరాలను వెల్లడిస్తామని.. తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమనియన్ మీడియాకు వెల్లడించారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను కోరారు. తమిళనాడు రాష్ట్రంలోని అన్ని ఎయిర్పోర్టులలో స్క్రీనింగ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా నిన్న ఆ దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరు విదేశీయులకు… ఒమిక్రాన్ వైరస్ సోకిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news