కరెంట్ బిల్లుల వసూలుకు వచ్చిన విద్యుత్ సిబ్బందిపై మెదక్ జిల్లాలోని ముస్లాపూర్ గ్రామ ప్రజలు తమ ఆగ్రహాన్ని చూపారు. ఇద్దరు అధికారులను పట్టుకొని స్తంభానికి కట్టేశారు. అధిక విద్యుత్ బిల్లులతో విసుగు చెందిన వారు ఈ రీతిలో తమ నిరసనను తెలిపారు. గత రెండు నెలలుగా అధిక విద్యుత్ బిల్లులు, కరెంటు కోతలు వంటి సమస్యలతో తాము తీవ్ర అసంతృప్తితో ఉన్నామని గ్రామస్థులు తెలిపారు. వీటి గురించి అధికారులకు చెప్పిన వారు చూసి చూడనట్టు వదిలేస్తున్నారని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana: Residents of a village under Alladurgam Police Station limits in Medak tied Electricity Department officials to a pole when they were visiting the area to collect payments of electricity bills. Police say, "We immediately reached the spot & released the officials." pic.twitter.com/IHcDyCXRbB
— ANI (@ANI) July 18, 2020
దీంతో విసుగు చెందిన గ్రామస్థులు తమ ఊరికి వచ్చిన విద్యుత్ అధికారులను తాళ్లతో కట్టేసి ఇలా నిరసనకు దిగారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం, అధిక కరెంట్ బిల్లు వంటి తమ సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారిని విడిపించారు.