ఆన్ లైన్ వార్: “సీబీఎన్”కి “సీబీఐ”కి చాలా తేడా ఉంది బుద్ధా…!

-

ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికలకు కొన్ని రోజుల ముందు వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. అయితే ఈ ఘటనపై సీబీఐ కేసు నమోదు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ రంగంలోకి దిగింది. దీంతో శనివారం కడప ఎస్పీ కార్యాలయంలో ఈ కేసుపై దర్యాప్తు జరిపిన సిట్ తో సీబీఐ అధికారులు సమావేశం అయ్యారు.

TDP Leader Buddha Venkanna Sensational Comments on YS Jagan

అయితే వివేకానంద రెడ్డి కేసును ఏపీ హైకోర్ట్ మార్చి నెలలో సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆయన భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత వేసిన పిటిషన్ పై హైకోర్టు ఆ తీర్పు వెలువడించింది. ఏడాది పూర్తయినా గానీ… కేసును సిట్ చేధించలేకపోయిందని… న్యాయస్థానం వివేకానంద రెడ్డి హత్య కేసులో అంతరాష్ట్ర నిందితులు ఉండే అవకాశం ఉందని చెప్పింది. అలాగే.. ఇతర రాష్ట్రాల నిందితులను పట్టుకునే శక్తి సామర్ధ్యాలు సీబీఐకి ఉందని అభిప్రాయాన్ని తెలిపింది. ఇంకా పులివెందుల పోలీస్ స్టేషన్ నుంచి ఈసీబీఐ దర్యాప్తు ప్రారంభించాలని అప్పట్లో కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

అయితే గత ఎన్నికల్లో సీబీఐకి వైఎస్ వివేకానంద రెడ్డి కేసును అప్పగించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. కానీ అంతకుముందే గత అధికార పార్టీలో నారా చంద్రబాబు నాయుడు ఏపీలో సీబీఐని అడుగు పెట్టనీయమంటూ బ్యాన్ విధించారు. సీబీఐ ఉంటే కేంద్రం ఆధిపత్యం ఉంటుందని… దీంతో సీబీఎన్ ఆధిపత్యం ఉండదని తెలుసుకున్న అధికార పార్టీ ఏకంగా సీబీఐపై రాష్ట్రం నిషేధం విధించింది. ఇక వైఎస్ జగన్ సీఎం అయిన వెంటనే సీబీఐకి బ్యాన్ ను రద్దు చేస్తూ సర్వస్వతంత్ర్యం ఇచ్చింది. అలాగే వైఎస్ జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచీ ఏ శాఖకు సంబంధించిన స్వేచ్ఛ ఆ శాఖకు ఇస్తూ సంపూర్ణాధికారంతో విలసిల్లుతుంది.

ఆ మధ్య టీడీపీ కూడా వైఎస్ వివేకా కేసు సీబీఐకి అప్పగించాలని కోరింది. ఇప్పుడు సీబీఐ రంగంలోకి దిగడంతో అంతా ఇది సీబీఎన్.. సీబీఐ కాదు…అంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ పెడుతున్నారు. కాగా ఇదే విషయంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందిస్తూ.. సీబీఐకి, వైఎస్ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందని వ్యాఖ్యానించారు. “బాత్రూంలో బాబాయ్ కేసులో సీబీఐ విచారణ మొదలెట్టేసినాది” అంటూ సెటైరికల్ ట్వీట్ వేశాడు. అంతటితో ఆగకుండా “ఇక అల్లుడికి, మామకు మరోసారి ఖైదు తప్పదు” అంటూ ఎద్దేవా చేశారు.

అందుకు వైసీపీ సోషల్ మీడియా మాత్రం గట్టి సరైన సెటైర్స్ వేస్తుంది. “బుద్ధిలేని వెంకన్నా.. సీబీఎన్ బండారం బయటపెడతారని గతంలో సీబీఐనే రానీకుండా చేశారు.. వైఎస్ జగన్ నికార్సైన పాలనతో సీబీఐ మీ భరతం పట్టేందుకు రంగప్రవేశం చేసింది.. కాస్త తగ్గు.. ముందుంది ముసళ్ల పండుగ” అంటూ వెటకారంగా పోస్ట్ లు పెడుతుండటం కాస్తా వైరల్ గా మారడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news