ముల్లంగి ఆకుతో కర్రీ.. కాలరీలు తక్కువ.. నొప్పులను తగ్గించే నెంబర్ వన్ ఐటమ్..!

-

ముల్లంగి వాడుకునే వాళ్లు చాలా తక్కువగా ఉంటారు.. ఇక ముల్లంగి ఆకును వాడేవాళ్లు అంటే.. మరీ అరుదు అనే చెప్పాలి. కానీ.. ముల్లంగి, ముల్లంగి ఆకు ఇ‌వి ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా షుగర్ పేషేంట్స్ కి ఇవి మరీ మేలు చేస్తాయి. మార్కెట్స్ లో ముల్లంగిని ఆకుతో సహా అమ్ముతున్నారు. ఈరోజు మనం ముల్లంగి ఆకుల కర్రీని నాచురల్ పద్థతిలో ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం.

ముల్లంగి ఆకుల కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు

ముల్లంగి ముక్కలు ఒక కప్పు
కట్ చేసిన ముల్లంగి ఆకు ఒక కప్పు
టమోటా ముక్కలు గింజలు తీసేసినవి అరకప్పు
టమాటా పేస్ట్ అరకప్పు
ఉల్లిపాయ ముక్కలు అరకప్పు
వేయించిన మినపప్పు ఒక చెంచా
జీలకర్ర ఒక టీ స్పూన్
ఎండుమిరపకాయలు మూడు
నిమ్మరసం ఒక చెంచా
మీగడ ఒక టీ స్పూన్
ధనియాల పొడి ఒక చెంచా

తయారు చేసే విధానం..

ముల్లంగి తీసుకుని పైన చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముల్లంగి ఆకులను కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. పొయ్యిమీద నాన్ స్టిక్ పాత్ర పెట్టి అందులో జీలకర్ర, పొట్టుతియ్యని మినప్పు, మీగడ , ఎండుమిరపకాయలు వేసి తాలింపు వేగిన తర్వాత.. కట్ చేసిన ముల్లంగి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి నాలుగు నిమిషాలు మూతపెట్టి ఉంచండి. కాసేపటికి అవన్నీ మగ్గుతాయి. ఆ తర్వాత.. సీడ్ లెస్ టమోటాలు ముక్కల కూడా వేసి కొద్దిగా పసుపు వేసి తిప్పండి. టమోటా పేస్ట్ వేసి మళ్లీ మూత పెట్టండి. మంచిగా ఆ పేస్టుతో ముల్లంగి ముక్కలు మగ్గుతాయి. ఆ తర్వాత కట్ చేసుకున్న ముల్లంగి ఆకులు వేసి అంతా కలియతిప్పండి. ముల్లంగి ఆకులు వేయడం తర్వాత ఉప్పులేని లోటు అస్సలు తెలియదు. ఇవే ఉప్పగా ఉంటాయి.. ధనియాల పొడి, నిమ్మరసం వేసి తిప్పేసి మూతపెట్టి 6-8 నిమిషాలు సిమ్ లో పెట్టి ఉంచండి. మగ్గిపోతాయి. టేస్టీగా తక్కువ కాలరీస్ తో ముల్లంగి ఆకు కర్రీ రెడీ. చపాతీలు, పుల్కాల్లోకి అద్భుతంగా ఉంటుంది.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news