డేటా చోరీ కేసు.. 67 కోట్ల మంది సమాచారం ఒక్కడే చోరీ చేశాడా..?

-

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారం వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయంపై ప్రధానంగా దృష్టిసారించారు. దాదాపు 67 కోట్ల మంది డేటా సేకరించిన కేసులో హరియాణాకు చెందిన వినయ్‌ భరద్వాజను పోలీసులు అరెస్టు చేశారు. అయితే 67 కోట్ల మంది డేటాను ఒక్కడే చోరీ చేశాడా లేదా అతడి వెనక ఇంకేదైనా ముఠా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వివిధ వ్యక్తులు, అనేక మార్గాల ద్వారా డేటా సేకరించి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. నిందితుడు వినయ్‌ భరద్వాజ్‌ గతంలో వెబ్‌ డిజైనర్‌గా పనిచేసేవాడు. అతనికి సాంకేతిక పరిజ్ఞానంపై బాగా పట్టున్నట్లు దర్యాప్తులో తేలింది. కొందరు వ్యక్తుల నుంచి సమాచారం కొని మిగిలింది వివిధ వెబ్‌సైట్లను హ్యాక్‌చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సమాచారం కొట్టేసేందుకు అవకాశమున్న వెబ్‌సైట్లను గుర్తిస్తున్నారు. డేటా చోరీ కేసులో ఇప్పటికే 11 సంస్థలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version