Rana – Sharwanand: మరో మల్టీస్టారర్ కు రానా గ్రీన్ సిగ్నల్! ఆ స్టార్ ఎవ‌రంటే!

-

Rana – Sharwanand: ఏన్నాడు లేని విధంగా తెలుగు చిత్ర సీమ‌లో మల్టీస్టారర్ మూవీస్ కు ప్రాధాన్యత పెరిగింది. ప్రేక్ష‌కుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తుండటంతో దర్శకనిర్మాతలు మల్టీస్టారర్ సినిమాల‌ను తీయ‌డానికి మొగ్గు చూపుతున్నారు.

ఇప్ప‌టికే తెలుగు ఇండ‌స్ట్రీలో.. డైరెక్ట‌ర్ ఎస్ ఎస్ రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్‌. ఈ చిత్రంలో మెగా హీరో రామ్ చరణ్, యంగ్‌ ఎన్టీఆర్ మ‌ల్టీ సార్టర్‌గా న‌టిస్తున్నారు. అలాగే..పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో ‘భీమ్లా నాయక్స చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాల‌నుంచి విడుద‌లైన ట్రైల‌ర్స్, ఫ‌స్ట్ లూక్ ల‌కు అనూష్య స్పంద‌న వ‌చ్చింది.

ఈ క్ర‌మంలో టాలీవుడ్‌లో మరో మల్టీస్టారర్ మూవీ కోసం రంగం సిద్ధమ‌వుతున్నార‌ట టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి. ఇప్పటికే ..ఓ వెబ్ సిరీస్ కోసం రానా త‌న బాబాయ్ వెంకటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ రెండు ప్రాజెక్టు పూర్తి అయిన త‌రువాత మరో యంగ్ హీరోతో కూడా స్క్రీన్ ని షేర్ చేసుకోవడానికి సిద్ద‌మ‌య్యారు రానా. ఆ హీరో ఎవ‌రో కాదంట‌.. మరో టాలెంటెడ్ హీరో శర్వానంద్.

గత వారంరోజులుగా రానా, శ‌ర్వాల కాంబినేషన్ లో క్రేజీ మల్టీస్టారర్ మూవీ తెర‌కెక్క‌నున్నట్టు వార్త‌లు వెలువ‌డుతున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించ‌నున్న‌ది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమాను ప్రారంభించి అతి త్వరలో ఫినిష్ చేయాలనేది ప్లాన్. ఈ మేరకు ఇప్పటికే రానా, శర్వాలతో సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని, చిత్ర దర్శకుడు, ఇతర వివరాలపై త్వరలోనే ఓ క్లారిటీ రానుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందట.

Read more RELATED
Recommended to you

Latest news