దమ్మాయిగూడ చిన్నారి మృతి కేసులో వీడిన మిస్టరీ

-

ఈనెల 15న పాఠశాలకు వెళ్లి అదృశ్యమైన పదేళ్ల చిన్నారి ఇందు మరుసటి రోజు విగతజీవిగా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దమ్మాయిగూడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇందు పోస్టుమార్టం నిర్వహించి మృతికి గల కారణాలు చెప్పాలని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. చిన్నారి మరణానికి గల కారణాలు తెలుసుకున్నారు.

దమ్మాయిగూడలో చిన్నారి ఇందు మృతి కేసులో పోలీసులు మిస్టరీ ఛేదించారు. ఇందు మరణం ప్రమాదవ శాత్తు జరిగిందని.. హత్య కాదని తేల్చారు. బాలిక ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయినట్లు వెల్లడించారు. మూత్ర విసర్జన కోసం చిన్నారి.. చెరువు దగ్గరకి వెళ్లిందని చెప్పారు. ఆడుకునేందుకు వచ్చిన చిన్నారికి.. ఎక్కడా సరైన ప్రదేశం లేకపోవడంతో మూత్ర విసర్జన కోసం చెరువు వద్దకి వెళ్లిందని వివరించారు. ఆ సమయంలో కాలు జారి పడిపోయినట్లు తెలిపారు. ఇందు ఊపిరితిత్తుల్లోకి చెరువు నీరు వెళ్లిందన్న పోలీసులు.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో వైద్యులు ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news