మట్టి ముట్టుకున్నంత మాత్రాన తెలంగాణ బిడ్డవు కావు – షర్మిలకు పాలేరు ఎమ్మెల్యే కౌంటర్‌

-

మట్టి ముట్టుకున్నంత మాత్రాన తెలంగాణ బిడ్డవు కావని వైఎస్‌ షర్మిలకు పాలేరు టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. రెండు రోజుల కిందట వైఎస్‌ షర్మిల పాలేరులో పార్టీ ఆఫీసు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె పర్యటనపైకందాళ ఉపేందర్ రెడ్డి స్పందించారు. ఈ మట్టి ముట్టుకున్నంత మాత్రాన ఈ ప్రాంత బిడ్డ కారు.. ఈ మట్టిలో పుడితే ఈ ప్రాంత బిడ్డవుతారని తేల్చి చెప్పారు.

ఎంతమంది పాలేరులో పోటీకొచ్చిన స్వాగతిద్దాం, అవసరమైతే ఇంకో పది మందిని పోటీ చేయండి అని చెబుదామన్నారు. మనం వేరే ప్రాంతం పోయి ఈ ప్రాంత బిడ్డను అంటే వాళ్లు నమ్ముతారా… మనం కూడా అంతేనని పేర్కొన్నారు. టికెట్ నాకే నేనే పోటీ చేస్తానని వేరే వారిలా గొప్పలు చెప్పుకోను… వార్ వన్ సైడే అవతల వాళ్ళకి డిపాజిట్లు కూడా దక్కవని తేల్చి చెప్పారు కందాళ ఉపేందర్ రెడ్డి. నా మొదటి ప్రాధాన్యత కార్యకర్తకు మాత్రమేనని…కార్యకర్తలు మీ మీ ప్రాంతంలో ఉండే సమస్యలు తెలుసుకొని నా దగ్గరకు రావాలని కోరారు. కచ్చితంగా అభివృద్ధి చేసి మాత్రమే ఓట్లు అడుగుతానని వివరించారు కందాళ ఉపేందర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news