తెలంగాణ రాష్ట్రంలో గత వారం పది రోజులుగా వర్షాలు ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల వరదలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారం మరో రెండు రోజులు ఇదే విధంగా భర్తీ వర్షాలు కురిసే అవకాశం ఉందట. ఈ విపత్కర పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని GHMC మేయర్ విజయలక్ష్మి కీలక ఆదేశాలను అధికారులకు జారీ చేశారు. భారీ వర్షాలు కారణంగా ఏ ఏరియాల్లో ఏ ప్రమాదం జరుగుతుందో ఊహించలేము.. కాబట్టి అధికారులు మరియు సిబ్బంది క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండాలని సూచించింది. ఇంకా లోతట్టు ప్రాంతాలలో నీరు ఎక్కువ సేపు నిలువకుండ తగిన జాగ్రత్తలను తీసుకోవాలంటూ చెప్పడం జరిగింది.
ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు తమ దగ్గర పనిచేసే సిబ్బందికి అత్యవసరం అయితే తప్ప సెలవులు ఇవ్వద్దని సీరియస్ గా ఆదేశాలను జారీ చేసింది.