భయపడాలి అనుకుంటే ఈ యూనిఫామ్ వేసుకోకపోయేదాన్ని

-

జూలై 1న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్రలో విధులు నిర్వహించడానికి ఎవరెవరు వెళ్తారో పేర్లు ఇవ్వాలని సీనియర్ కమాండెంట్ పిలుపునిచ్చాడు. నేను వెళ్తాను అదితి చౌదరి ధైర్యంగా చెప్పింది. ఇంతవరకూ అక్కడికి ఏ మహిళా ఆఫీసర్ వెళ్లలేదు. అక్కడ అంత క్లిష్ట పరిస్థితులుంటాయి. అలాంటి ప్రాంతానికి నువ్వు వెళ్తావా?అని ఆశ్చర్యపోయాడా సీనియర్. భయపడాలి అనుకుంటే ఈ యూనిఫామ్ వేసుకోకపోయేదాన్ని న అని తేల్చి చెప్పింది. ఆమె ఎవరో కాదు ఎంబీబీఎస్ వృత్తిని కాదని బీఎస్‌ఎఫ్‌లో చేరిన అసిస్టెంట్ కమాండెంట్ మెడికల్ ఆఫీసర్ అదితి చౌదరి..
సవాళ్లను ఎదుర్కొని, సేవలందించడానికి ఎంబీబీఎస్ వృత్తిని కాదని బీఎస్‌ఎఫ్‌లోకి అడుగుపెట్టింది ఈ డాక్టర్ అదితి చౌదరి. అమర్‌నాథ్ యాత్రలో 12 వేల ఫీట్ల ఎత్తులో వైద్యసేవలందించేందుకు సాహసం చేసింది ఈమె. సవాళ్ళను ఎదుర్కొని అమర్‌నాథ్ యాత్ర డ్యూటీకి బయల్దేరింది. జూన్ 15న ఆ బృందం కశ్మీర్ సరిహద్దుల్లోకి చేరుకుంది. అందులో అదితి మాత్రమే మహిళా ఆఫీసర్. అమర్‌నాథ్‌లో డ్యూటీ అంటే వరుసగా 45 రోజులూ చేయడానికి ఏ అధికారీ సిద్ధపడలేడు. ఈ పరిస్థితుల్లో అదితి దీన్ని సాహసంగా తీసుకుంది. అక్కడ చాలా ఇబ్బందులుంటాయి ఆలోచించుకో సీనియర్ సలహా ఇచ్చాడు. అప్పుడు అదితి చౌదరి ధైర్యంగా ముందుకొచ్చి చెప్పిన మాటలివి.

నా వయస్సు 26. చాలా యాక్టివ్‌గా ఉన్నాను. మీరు భయపడాల్సిన అవసరం లేదు అని తేల్చిచెప్పింది. దీంతో ఆ కమాండెంట్ అదితి చౌదరి పేరు ఫైనల్ చేసేశాడు. అనుకున్నట్టుగానే 15 మందితో కూడిన బృందం అమర్‌నాథ్ యాత్ర డ్యూటీకి బయల్దేరింది. జూన్ 15న ఆ బృందం కశ్మీర్ సరిహద్దుల్లోకి చేరుకుంది. అందులో అదితి మాత్రమే మహిళా ఆఫీసర్. అమర్‌నాథ్‌లో డ్యూటీ అంటే వరుసగా 45 రోజులూ చేయడానికి ఏ అధికారీ సిద్ధపడలేడు. ఈ పరిస్థితుల్లో అదితి దీన్ని సాహసంగా తీసుకుంది. అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైన తర్వాత అదితి వైద్యసేవలు ప్రారంభించింది. 12వేల అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన క్యాంపులో అదితి విధులు నిర్వహిస్తున్నది. ఇది ఆగస్టు 15 వరకూ కొనసాగుతుంది. అమర్‌నాథ్ యాత్రలో సాహసోపేత బాధ్యతులు నిర్వహించడంతోపాటు బీఎస్‌ఎఫ్‌లో ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి నింపుదన్నది అదితి. ఆమె ఛండీగఢ్‌కు చెందిన మహిళ. పుణేలో ఎంబీబీఎస్ చేసింది. హర్యానాలో 2017 సివిల్ సర్వీస్ ఆఫీసర్‌గా చేరింది. కిందటి ఏడాది సెప్టెంబర్‌లో బీఎస్‌ఎఫ్‌లోకి వచ్చింది. 138 బెటాలియన్ పంజాబ్‌లోని బిఖ్వింద్‌లో ఉంది. అక్కడే మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ కమాండెంట్‌గా అడుగుపెట్టి, ధైర్య సాహసాలతో ముందుకు సాగుతున్నది.

Read more RELATED
Recommended to you

Latest news