Dasara review and rating :యాక్షన్ సీన్స్ హైలెట్ .. నాని హిట్ కొట్టినట్లేనా..

-

సినిమా: దసరా

నటీనటులు: నాని, కీర్తి సురేష్, సముద్రఖని, ధీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, సాయి కుమార్, షమ్నా కాసిం, సజోల్ చౌదరిమోర్.

దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల

రచయిత: శ్రీకాంత్ ఓదెల

సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్

సంగీతం: సంతోష్ నారాయణన్

నిర్మాత : సుధాకర్ చెరుకూరి

నిర్మాణ సంస్థ : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్

విడుదల తేదీ : మార్చి 30,2023

న్యాచురల్ స్టార్ నాని సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇటీవల వరుసగా హిట్ టాక్ ను అందుకుంటున్నాయి.. ఇప్పుడు మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటించాడు.. దసరా మూవి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఇందులో నాని హీరోగా.. కీర్తి సురేష్ హీరోయిన్గా నటించగా.. ఇద్దరు కూడా డీ గ్లామరస్ లుక్కులో నటించారు. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ అవ్వబోతోంది. అయితే ఈలోపు ఓవర్సీస్ లో, ప్రీమియర్ షోలు పడగా అక్కడ సినిమా చూసిన ఆడియన్స్ అంతా తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా పంచుకుంటున్నారు. మరి అభిమానులు ఏమంటున్నారు? నాని సక్సెస్ అయ్యాడా? అనేది ఇప్పుడు చూద్దాం…

నాని, కీర్తి సురేష్ మొదట నేను లోకల్ సినిమాలో నటించారు.. ఆ సినిమా మంచి హిట్ ను అందుకోవడంతో ఇప్పుడు ఈ సినిమా పై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి.మంచి ఫ్రెండ్స్ కావడంతో షూటింగ్ లొకేషన్లో అల్లరి వాతావరణం, పండగ వాతావరణం నెలకొంది. ఇద్దరు కలిసి ఆటలు, పాటలు చిన్నచిన్న తగువులతో దసరా సినిమా షూటింగు పండగల జరుపుకున్నారు. దాంతో మూవీ కూడా అద్భుతంగా వచ్చినట్టు తెలుస్తోంది. అటు ఆడియన్స్ కూడా సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమా చూసిన ఆడియన్స్ అందరూ కూడా దాదాపుగా అన్నీ పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు.

మాస్ లుక్ లో నాని ఆదరగోట్టాడు, ఇక కీర్తి సురేష్ వేరే లెవల్.. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు విజ్రుంభించారు..స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది అంటూ రివ్యూ వస్తోంది. నాని పెర్ఫార్మెన్స్ కు వందకు వంద మార్కులు ఇచ్చేస్తున్నారు.. నాని కెరియర్ లోనే ఇది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటూ కితాబు కూడా ఇస్తున్నారు. ఎమోషన్స్, యాక్షన్స్ అదిరిపోయాయని తెలిపారు. అలాగే నాని ఇంట్రడక్షన్, సిల్క్ స్మిత ఎపిసోడ్ తో పాటు క్రికెట్ ఎపిసోడ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అని.. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమా నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫామెన్స్ అని అంటున్నారు..

మ్యూజిక్, బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు గూస్ బంబ్స్ తెప్పిస్తుంది.. యాక్షన్ సీన్స్ కు హైలెట్ అయ్యింది.. ఇకపోతే డైరెక్టర్ తన మార్క్ ను చూపించాడు.. కథకు ప్రాణం పోసాడు.. ఈ సినిమా నానికి మరో హిట్ ను అందించిందని సినీ విశ్లేషకులు అంటున్నారు..చివరగా సినిమాను ప్రతి ఒక్కరు చూడొచ్చు..ఈ సినిమాకు 3.5/5 రేటింగ్ ను ఇస్తున్నారు.. మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news