తాజాగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న మీటర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది తమిళ సోయగం అతుల్య రవి.. అందంతోనే కుర్రాలను ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీకి తెలుగులో ఇదే మొదటి చిత్రం కావడం గమనార్హం. సినిమా రిలీజ్ కి ముందే సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది అతుల్య రవి. సినిమా తర్వాత తెలుగులో బిజీ హీరోయిన్ అవ్వడం మాత్రం పక్కా అనేట్టుగా తన అందాలతో యువతను ఆకట్టుకుంటుంది. తెలుగులో సినిమాలు చేయాలని దాదాపు మూడు సంవత్సరాల నుంచి అనుకుంటుందట. కానీ సరైన కథ కుదరకే ఇన్నాళ్లు వెయిట్ చేశానని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ.
కోవిడ్ సమయంలో మూడు, నాలుగు తెలుగు సినిమా కథలను కూడా వినిందట. అయితే తన మొదటి సినిమాతోనే అవి మంచి సక్సెస్ అందివ్వలేవు అని ఆలోచించిన ఈమె అవకాశాలను వదులుకున్నట్లు తెలిపింది. ఇక తర్వాత మీటర్ స్టోరీ తోనే తన పాత్ర వ్యక్తిగతంగా కూడా కనెక్ట్ అవడంతో మరో ఆలోచన లేకుండా ఓకే చేసిందట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాతో తెలుగు పరిచయం కాబోతోంది. ఎక్కువగా ప్రేమ కథలో నటించాలని ఉంది అంటూ తన కోరికను బయటపెట్టింది.
అలాంటి స్టోరీలైతే యువతకు బాగా కనెక్ట్ అవుతాయని.. రీచ్ ఎక్కువగా ఉంటుందని కూడా తెలిపింది. తెలుగులో స్టార్ హీరోలు అందరితో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను.. నా ప్రతిభను గుర్తించి దర్శక నిర్మాతలు అటువంటి అవకాశాలు కల్పిస్తారని ఆశిస్తున్నాను అంటూ తెలిపింది. కిరణ్ అబ్బవరం హీరోగా రమేష్ కడూరి దర్శకత్వంలో వస్తున్న మీటర్ చిత్రం ఏప్రిల్ 7వ తేదీన విడుదల కాబోతోంది.