ఎన్నికలకు ముందు వైఎస్ జగన్.. చేసేదే చెబుతాను.. చెప్పిందే చేస్తాను అని అన్న మాట ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటున్నారు. ఎన్నికల సందర్భంగా ప్రకటించిన నవరత్నాల్లో ఒకటైన ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టారు. నేడు ఒకేసారి ఐదు లక్షల గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటలో ఈ మేరకు నిర్వహించిన సంబురాలు అంబారాన్ని అంటాయి. రాష్ట్రంలో ప్రతి పేదవానికి సొంత ఇళ్లు ఉండాలన్నదే వైఎస్ జగన్ లక్ష్యం. ప్రతి అక్కాచెల్లెమ్మ తన పిల్లపాపలతో సొంత ఇంటిలో ఉండాలని ఒక అన్నలా తన వంతు సాయం అందిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 30.75 లక్షల మందికి దాదాపు రూ.76వేల కోట్ల విలువైన ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాలను అందజేశారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 21.76లక్షల ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. అందుకోసం ఏకంగా సుమారు రూ.56,700 కోట్ల బడ్జెట్ కేటాయించారు. అసలే అప్పుల్లో ఉన్నప్పటికీ పేదల కష్టాన్ని అర్థం చేసుకుని జగనన్న ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టేందుకు వెనకాడడం లేదు. తన ప్రజలకు సొంత ఇళ్లు ఇవ్వాలని ధృడ నిర్ణయం ముందు ఇలాంటి సమస్యలను ఎన్నింటినైనా ఎదుర్కొని ముందుకు వెళ్తున్నారు వైఎస్ జగన్.
ఊరికి దూరంగా కొండల్లో, గుట్టల్లో ఇంటి పట్టాలిచ్చారు అన్న ప్రతిపక్షాల నోళ్లు మూయించేలా జగనన్న కాలనీలను నిర్మించారు. చూసినోళ్లంతా అశ్చర్యపోయేలా అక్కడ మొదట మౌలిక వసతులను కల్పించారు. ప్రజలకు కొన్నేళ్ల పాటు ఇబ్బందుల పాలు కాకుండా రోడ్లు, నీళ్లు, విద్యుత్, పార్కుల వంటివి సమకూర్చారు. ఆ తర్వాతే మెల్లగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. కాస్తో కూస్తో ఆర్థిక స్థోమత ఉన్న ప్రజలు ప్రభుత్వం ఇచ్చిన దానికంటే కొంత కలేసి మరింత అందంగా తమ ఇళ్లను రూపుదిద్దుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన జాగా, కట్టించిన ఇళ్లు ఎంత తక్కువకు లెక్కేసినా ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.15 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఎప్పుడూ ప్రజలకోసం పాటు పడే సీఎం వైఎస్ జగన్ ఆలోచనలు వాస్తవరూపం దాలుస్తుండడంతో.. ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లువిరుస్తున్నాయి. సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలోని పేదల జీవన స్వరూపమే క్రమేపీ మారుతుందనడంలో సందేహమే లేదు. ఏపీలో జగన్ ఆదేశాల మేరకు ఉద్యమంలా ఇళ్ల నిర్మాణాల కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇప్పటికే ఈ పథకం కింద 5.24 లక్షల గృహాలు పూర్తయ్యాయి. వాటిని నేడు లబ్ధిదారులకు అందజేస్తారు. ఈ క్రమంలో దాదాపు 2412 ఇళ్లను పూర్తి చేసుకున్న సామర్లకోట పట్టణంలో లబ్ధిదారులకు అందించారు. ఇటుక, సిమెంట్, కంకర, ఐరన్, తలుపులు, గుమ్మాలు, కిటీకీలను సైతం సమకూరుస్తూ నిర్మాణాలు త్వరగా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక అన్నగా ఆడబిడ్డ కట్నం అందజేస్తున్న సీఎం జగన్ ను అందరూ మెచ్చుకుంటున్నారు.