పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియల్లో బిగ్‌ ట్విస్ట్‌ !

-

కన్నడ పవన్‌ స్టార్‌ పునీత్ రాజ్ కుమార్ అంత్య క్రియల్లో… బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. కన్నడ స్టార్‌ పునీత్ రాజ్ కుమార్ అంత్య క్రియలు రేపటికి వాయిదా పడ్డాయి. విదేశాల లో ఉన్న కుటుంబ సభ్యుల రాక ఆలస్యం కావడం తో అంత్యక్రియలు వాయిదా పడినట్లు సమాచారం అందుతోంది.

కొద్ది సేపటి క్రితం మీడియా కు అంత్య క్రియలు వివరాలు వెల్లడించారు కర్ణాటక సిఎం బొమ్మై. రేపు అధికారిక లాంఛనాలతో… పునీత్ రాజ్ కుమార్ అంత్య క్రియలు నిర్వహిస్తామని కర్ణాటక సీఎం బొమ్మై స్పష్టం చేశారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు, వ్యాపార వేత్తలు తదితరులు…. పునీత్‌ రాజ్‌ కుమార్‌ భౌతిక ఖాయానికి నివాళులు అర్పించారని వెల్లడించారు. కాగా…నిన్న మధ్యాహ్నం గుండె పోటు తో పునీత్‌ రాజ్‌ కుమార్‌ మృతి చెందిన సంగతి తెలిసిందే. బెంగళూరు లోని విక్రమ్‌ ఆస్పత్రి లో చికిత్స పొందుతూ… పునీత్‌ రాజ్‌ కుమార్‌ మృతి చెందారు. దీంతో చిత్ర పరిశ్రమలో విషాదంలోకి నెట్టి వేయబడింది.

Read more RELATED
Recommended to you

Latest news