హైదరాబాద్ లో భారీగా నగదు పట్టివేత..దుబ్బాక కేనా…?

హైదరాబాద్‌లో భారీగా నగదును సీజ్ చేవారు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు. హైదరాబాద్ తో పాటు.. వివిధ ప్రాంతాల్లో కోటికి పైగా హవాలా డబ్బును పట్టుకున్నారు. ఈ డబ్బును దుబ్బాకలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.

నేటితో దుబ్బాక ఎన్నికల ప్రచారం ముగియనుంది. దుబ్బాకలో ఓటర్లను ప్రభావితం చేసేందుకే కొంతమంది నేతలు ఈ డబ్బును తరలిస్తున్నారని చెబుతున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. గతంలో ఓ పార్టీ నుంచి పెద్ద మొత్తంలో నగదును పట్టుకున్నారు పోలీసులు.