కరోనా వైరస్ వ్యాక్సిన్ వ్యాక్సిన్ తీసుకున్నా ఆరోగ్య శాఖా మంత్రికి కరోనా

-

హర్యానా ఆరోగ్య శాఖా మంత్రి అనిల్ విజ్ కరోనా వైరస్ బారిన పడ్డారు. తాను కరోనా బారిన పడ్డా అని ఆయన వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ కోసం ఆయన ముందుకు రాగా ఆయనకు గత నెల 20న డోస్ ఇచ్చారు. అయినా సరే ఆయనకు కరోనా సోకింది. తనతో సన్నిహితంగా ఉన్న వారు కరోనా పరిక్షలు చేయించుకోవాలి అని ఆయన సూచించారు.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తో పాటు భారత్ బయోటెక్ కలిసి తయారు చేస్తున్న కో వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ మన దేశంలో జరుగుతున్నాయి. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ మీద ఇండియా చాలా ఆశలు పెట్టుకుంది. మరి ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news